Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బ్రిటన్కు చెందిన డేటా అండ్ అనలిటిక్స్, ఇఆర్పి స్పెషలిస్ట్ కన్సల్టెన్సీ కంపెనీ కగూల్ గచ్చిబౌలిలో అదనపు కార్యాలయ స్థలాన్ని కొనుగోలు చేసినట్టు ప్రకటించింది. దీంతో నగరంలో తమ కార్యకలాపాలను విస్తరించినట్లయ్యిందని కగూల్ సీఈఓ డాన్ బార్లో తెలిపారు. 200 మందికి పైగా ఉద్యోగులకు వసతి కల్పించే కొత్త 17,000 చదరపు అడుగుల కార్యాలయాన్ని ఆయన సోమవారం లాంచనంగా ప్రారంభించారు. పెట్టుబడులు, విస్తరణ, బెంచ్ బలాన్ని పెంచడంతో సహా భారతదేశం కోసం తాము ప్రకటించిన వ్యూహాత్మక వృద్ధి ప్రణాళికలకు అనుగుణంగా హైదరాబాద్లో కార్యకలాపాలను విస్తరిస్తున్నామన్నారు.