Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒమిడ్యార్ నెట్వర్క్ ఇండియా, సర్జ్ సీక్వోయా మరియు 9 యునికార్న్స్ నేతృత్వంలో సిరీస్ ఏ రౌండ్లో భాగంగా 60 కోట్ల రూపాయలను సమీకరించిన డ్రింక్ ప్రైమ్
ఐఓటీ ఆధారిత కస్టమైజ్డ్ వాటర్ ఫ్యూరిఫైయర్ కంపెనీ 2026 నాటికి భారతదేశంలో ఒక మిలియన్ గృహాలకు చేరుకోవడానికి ఈ నిధులు తోడ్పడతాయి
బెంగళూరు, జూలై 2022 : ఐఓటీ ఆధారిత కస్టమైజ్డ్ వాటర్ ఫ్యూరిఫైయర్ సంస్థ డ్రింక్ ప్రైమ్ తమ సిరీస్ ఏ రౌండ్లో భాగంగా 60 కోట్ల రూపాయలను సమీకరించింది. ఈ కంపెనీ 2026 నాటికి భారతదేశ వ్యాప్తంగా ఒక మిలియన్ గృహాలను చేరుకునేందుకు అవసరమైన మౌలిక వసతులు, ఉత్పుత్తులు, ఉద్యోగులపై పెట్టుబ డులు పెట్టేందుకు ఇవి తోడ్పడనున్నాయి. ఈ రౌండ్‌కు మార్క్యూ ఇన్వెస్టర్లు అయినటువంటి ఒమిడ్యార్ నెట్వర్క్ ఇండియా, సర్జ్ సీక్వోయా, 9 యునికార్న్స్లు నేతృత్వం వహించాయి.
ఈ ఫండ్ రైజింగ్‌తో పాటుగా డ్రింక్ ప్రైమ్ రోడ్‌మ్యాప్ గురించి డ్రింక్ ప్రైమ్ కోఉఫౌండర్, సీఈవో విజేందర్ రెడ్డి ముత్యాల మాట్లాడుతూ.. 'వాటర్ ఫ్యూరిఫైయర్ తయారీ కంపెనీ డ్రింక్ ప్రైమ్ కాదు. ఇది తాగునీటి కంపెనీ. భారతదేశంలో అధికశాతం మంది ప్రజలకు సురక్షిత తాగునీటిని చేరువ చేయడానికి మేము నిధులను సేకరించాము. 2026 నాటికి ఒక మిలియన్ చందాదారులకు అవసరమైన సేవలనందించేందుకు చేయాల్సిందంతా చేస్తాము` అని అన్నారు.
బెంగళూరులో సుప్రసిద్ధ వాటర్ ప్యూరిఫైయర్ బ్రాండ్‌గా గత ఆరు నెలల్లో గణనీయంగా వృద్ధి చెందుతూ బెంగళూరు, ఢిల్లీ, ఫరీదాబాద్, ఘజియాబాద్, గుర్గావ్, హైదరాబాద్, నోయిడాలలో ఒక లక్ష కు వినియోగదారులకు సేవలనందిస్తుంది.
తమ చందాదారుల సంఖ్య ఈ సంవత్సరం 330% పెరిగిందని, గత కొద్ది నెలలుగా చందాదారుల సంఖ్య మరింత వేగంగా పెరుగుతుందని డ్రింక్ ప్రైమ్ సీఓఓ, కో-ఫౌండర్ మానస్ రంజన్ హోతా అన్నారు.
తమ పెట్టుబడులను గురించి ఒమిడ్యార్ నెట్వర్క్ భాగస్వామి బద్రి పిల్లపాక్కమ్ మాట్లాడుతూ.. 'వేడి నీళ్లకంటే కూడా చవకైన రీతిలో తాగు నీటిని అందించే ప్రయత్నం చేస్తోన్న డ్రింక్ ప్రైమ్‌తో భాగస్వామ్యం పట్ల సంతోషంగా ఉన్నామన్నారు. తమ ఈఎస్జీ పెట్టుబడి విధానంతో ఈ పెట్టుబడులు పెట్టామని వెంచర్ క్యాటలిస్ట్స్ అండ్ 9 యునికార్న్స్ కో-ఫౌండర్ డాక్టర్ అపూర్వ రంజన్ శర్మ చెబుతూ త్వరలోనే తాగు నీటి రంగం నుంచి కూడా యునికార్న్‌లు వస్తాయని ఆశిస్తున్నట్టు తెలిపారు.
డ్రింక్ ప్రైమ్ సిరీస్ ఏ రౌండ్లో ఔరెలిస్ వెంచర్స్, క్వాయిష్ వెంచర్స్, జెడ్ఎన్ఎల్ గ్రోత్ ఫండ్ తో పాటు గాడెబ్ట్ క్యాపిటల్ రైజ్‌లో నార్త్రన్ ఆర్క్క్యాపిటల్, యునిటస్ క్యాపిటల్ ఉన్నాయి.
పట్టణ ప్రాంతాలలో స్వచ్ఛమైన తాగునీటి అవసరాలను డ్రింక్ ప్రైమ్ తీరుస్తుందని , దీనిలో పెట్టుబడులు పెట్టడం వల్ల సంతోషంగా ఉన్నామని నార్త్రన్ ఆర్క్ క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ - సీఓఓ బామా బాలకృష్ణన్ అన్నారు.