Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘనంగా బీఓబీ వ్యవస్థాపక దినోత్సవం
హైదరాబాద్ : ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) 115 వ్యవస్థాపక దినోత్సవాన్ని ఆ బ్యాంక్ తెలంగాణ సౌత్ రీజియన్ ఘనంగా నిర్వహించింది. బుధవారం హైదరాబాద్లో ఈ వేడుకలను రీజినల్ మేనేజర్ టివివిఎస్ శర్మ జ్యోతి వెలిగించి లాంచనంగా ప్రారం భించారు. రీజినల్ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ జతిన్ అంట్టల్, ఎస్ఎంఎస్ హెడ్ రఘు కిషన్, క్రెడిట్ హెడ్ సిహెచ్ సతీష్ కుమార్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శర్మ మాట్లాడుతూ నాణ్యమై న వ్యాపార వృద్థితో బ్యాంకింగ్ వ్యాపారంలో మార్కెట్ వాటాను మరింత పెంచుకునేలా ఉద్యోగులు కృషి చేయాలని సూచించారు. ఆధునిక డిజి టల్ టెక్నాలజీ సేవలను ఖాతాదారులకు చేరువ చేయాలన్నారు.