Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తన ప్లాట్‌ఫారమ్‌పై బిట్కాయిన్ల వ్యాపార లావాదేవీలపై పరిమిత కాలానికి ఫీజులను మాఫీ చేస్తున్నట్లు భారతదేశంలో అతిపెద్ద క్రిప్టో ఇన్వెస్టింగ్ యాప్ కాయిన్‌స్విచ్ ప్రకటించింది. పూర్తిగా ధృవీకరించిన నో-యువర్-క్లయింట్ (కేవైసీ) మరియు ఇండియన్ బ్యాంక్ శాఖల్లో ఖాతాలు ఉన్న కాయిన్‌స్విచ్.కో వినియోగదారులు అందరూ ఈ ఆఫర్ జారీలో ఉన్న సమయంలో బిట్‌కాయిన్ లావాదేవీలను ఎటువంటి రుసుము లేకుండా భారతీయ రూపాయలలో చేసుకోవచ్చు. మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం బిట్‌కాయిన్ అతిపెద్ద క్రిప్టోగా ఉంది. భారతీయ క్రిప్టో మార్కెట్ జాబితా అయిన సీఆర్ఈ8లో 35% కన్నా ఎక్కువ వాటాను కలిగి ఉంది. సిప్ మరియు లిమిట్ ఆర్డర్లతో సహా అన్ని బిట్‌కాయిన్ లావాదేవీలకు, అలాగే రిఫరల్‌లు, ఇతర ప్రమోషనల్ కార్యకలాపాలకు రివార్డ్‌లుగా అందుకున్న బిట్కాయిన్ల విక్రయాలపై ఈ జీరో-ఫీ ట్రేడింగ్ ఆఫర్ వర్తిస్తుంది.
ఆర్డర్ విలువపై తక్కువ లేదా ఎక్కువ అనే పరిమితి లేకపోవడంతో పాక్షిక మరియు అధిక-విలువను పెట్టుబడిగా పెట్టేవారు కూడా ఆఫర్ ప్రయోజనాన్ని పొందవచ్చు. తన బ్లాగ్ మరియు యూట్యూబ్ వీడియోల ద్వారా కాయిన్‌స్విచ్ తన వినియోగదారులకు పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలను తీసుకునేందుకు కావలసిన అవగాహనను కల్పిస్తోంది. గత నెల కాయిన్‌స్విచ్ తన ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌లో 100వ కాయిన్‌ను లిస్ట్ చేసింది. సురక్షితమైన పెట్టుబడి మార్గదర్శకాలను అనుసరించి ఈ క్రిప్టో ఆస్తులను భారతీయ రూపాయలలో కొనుగోలు చేసేందుకు మరియు విక్రయించేందుకు వినియోగదారుకు సంస్థ అవకాశాన్ని కల్పిస్తోంది.