Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.10 లక్షల కోట్లు పెరిగిన సంపద
హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరు సెషన్లలో లాభపడ్డాయి. శుక్రవారం సెషన్లో బిఎస్ఇ సెన్సెక్స్ 390 పాయింట్లు పెరిగి 56,072కు చేరింది. నిఫ్టీ-50 సూచీ 114 పాయింట్లు రాణించి 16,719 వద్ద ముగిసింది. ఎఫ్ఐఐల కొనుగోళ్ల మద్దతు, అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ట్రేడింగ్ కావడం, చమురు బ్యారెల్ ధర 100 డాలర్లకు దిగిరావడం తదితర పరిణామాలు మార్కెట్లకు ప్రధాన మద్దతును అందించాయి. ఆరు సెషన్లలో వరుస లాభాలతో బీఎస్ఈ మార్కెట్ కాపిటలైజేషన్ రూ.10.38 లక్షల కోట్లు పెరిగి రూ.261.04 కోట్లకు చేరింది. అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్, యూపీఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐచర్మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్ సూచీలు అధికంగా 2 శాతం వరకు లాభపడిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. నిఫ్టీలో బ్యాంకింగ్ సూచీ 1.6 శాతం, పీఎస్యూ బ్యాంకింగ్ సూచీ 1.5 శాతం చొప్పున పెరిగి మార్కెట్లకు ప్రధాన మద్దతును అందించగా.. ఐటి 0.6 శాతం తగ్గింది.