Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ ఈక్విటీ ఫండ్ సంస్థ హెచ్‌డిఎఫ్‌సి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఎఎంసీ) చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ (సీఐఓ) ప్రశాంత్ జైన్ అనుహ్యాంగా ఆ సంస్థకు రాజీనామా చేశారు. భారత మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో జైన్ ఆది నుంచి దాదాపుగా మూడు దశాబ్దాల పాటు పని చేసిన అనుభవం ఉంది. హెచ్డీఎఫ్సీ ఎఎంసీలో దాదాపుగా రూ.4.20 లక్షల కోట్ల విలువైన ఈక్విటీ ఫండ్లను నిర్వహిస్తున్నారు. ఐఐఎం బెంగళూరు నుంచి ఎంబిఎ పూర్తి చేశారు. హెచ్డీఎఫ్సీ ఎఎంసీలో 19 ఏండ్ల నుంచి పని చేస్తున్న ఆయన రాజీనామాను ఆ సంస్థ ఆమోదించింది. ప్రశాంత్ జైన్ స్థానంలో చిరాగ్ సెతల్వాద్‌ను నియమించింది.