Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత ఆర్థిక వ్యవస్థ భేష్..
- ప్రపంచ దేశాలతో పోల్చితే బాగున్నాం
- ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడి
న్యూఢిల్లీ : అంతర్జాతీయ పరిస్థితులతో పోల్చితే భారత ఆర్థిక వ్యవస్థ బాగుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. అభివృద్థి చెందిన, వర్థమాన దేశాల కరెన్సీల తో పోల్చితే రూపాయి పటిష్టంగానే ఉందన్నారు. ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలతో బాగానే ట్రేడింగ్ అవుతుందన్నారు. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 80కి పడిపోయిన విషయం తెలిసిందే. నగదు లభ్యతకు సరిపడ అమెరికా డాలర్లను ఆర్బీఐ సరఫరా చేస్తుందని దాస్ తెలిపారు. శుక్రవారం జరిగిన బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) వార్షిక బ్యాంకింగ్ కాన్క్లేవ్ 2022లో శక్తికాంత దాస్ మాట్లాడుతూ ఖాతాదారుల ఆసక్తులు, అంచనాలకు అనుగుణంగా బ్యాంకింగ్ పరిశ్రమ మారాలన్నారు. ప్రతీ అభివృద్థి ఓ ప్రత్యేక అవకాశమన్నారు. పాత, కొత్త సంస్థలకు సవాళ్లు నెలకొని ఉన్నాయన్నారు. ద్రవ్యోల్బణ లక్ష్య కట్టడికి అనుగుణంగా బాగా పని చేస్తున్నామన్నారు. వృద్థిని దృష్టిలో పెట్టుకునే నగదు లభ్యత, వడ్డీ రేట్ల పెంపు నిర్ణయాలు ఉంటాయన్నారు.