Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ ఇన్వెస్టర్ రాకేశ్ ఝుంఝున్‌వాలాకు చెందిన ఆకాశ ఎయిర్ విమానయాన సేవ లు ఆగస్టు 7న లాంచనంగా ప్రారం భం కానున్నాయి. తొలి విమానం బోయింగ్ 737 మ్యాక్స్‌తో ముంబయి- అహ్మదాబాద్ రూట్లో ప్రయాణించనుందని శుక్రవారం ఆ సంస్థ వెల్లడించింది. ఈ మార్గంలో వారానికి 28 విమానాలు నడుస్తాయని తెలిపింది. ఆగస్టు 13 నుంచి బెంగళూరు- కొచ్చి మార్గంలో వారానికి 28 విమానాలను నడిపించనున్నట్లు పేర్కొంది. ఆయా మార్గాల్లో టికెట్ బుకింగ్‌లను ప్రారంభించినట్లు వెల్లడించింది. రెండు 737 మ్యాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో ఆకాశ ఎయిర్ వాణిజ్య సేవలను ప్రారంభిస్తోంది.