Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రెడ్మీలో అత్యంత శక్తివంతమైనది. దీనిలో ఫ్లాగ్షిప్ మీడియా టెక్ డైమెన్శిటీ 8100 చిప్సెట్, 144 హెర్ట్జ్ ఎఫ్ఎఫ్ఎస్ అడాప్టివ్ సింక్ డిస్ప్లే కలిగి ఉండటంతో పాటుగా అత్యద్భుతమైన బ్యాటరీ లైఫ్ మరియు ఇండియా రెడీ 5జీ కలిగి ఉంది
రెడ్మీ ఇండియా ఇప్పుడు పూర్తి సరికొత్త రెడ్మీ ఇయర్‌బడ్స్ 3 లైట్‌ను సైతం విడుదల చేసింది. అతి ఖచ్చితమైన వైర్లెస్ సహచరిగా ఇది నిలుస్తుంది
ఇండియా 2022 : దేశంలో నెంబర్ 1 స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ షావోమీ ఇండియా నేడు తమ అత్యుత్తమంగా విక్రయించబడిన రెడ్మీ కె సిరీస్‌ను రెడ్మీ కె 50ఐ 5జీ ఆవిష్కరణతో తిరిగి తీసుకువచ్చింది. ప్రైస్ టు పెర్ఫార్మెన్స్ రేషియోను ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని తీర్చిదిద్దిన రెడ్మీ కె 50ఐ అసాధారణ పనితీరును ప్రతిష్టాత్మకమైన మీడియా టెక్ డైమెన్సిటీ 8100, 144 హెర్ట్జ్ ఎఫ్ఎఫ్ఎస్ అడాప్టివ్ సింక్ డిస్ప్లే, 67 వాట్ టర్బో చార్జర్ మరియు ట్రిపుల్ కెమెరా సెటప్ వంటివి కలిగి అత్యంత అందుబాటు ధరలో లభిస్తుంది. ఈ ఆవిష్కరణతో రెడ్మీ పూర్తి సరికొత్త అసాధారణ పనితీరును భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మిడ్ ప్రీమియం విభాగంలో అందిస్తుంది. ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు.
‘‘రెడ్మీ కె సిరీస్, భారతదేశంలో పెర్ఫార్మెన్స్ కోసం నూతన బెంచ్‌మార్క్‌ను రెడ్మీ కె 20 మరియు రెడ్మీ కె20 ప్రోను 2019లో ఆవిష్కరించడం ద్వారా సృష్టించింది. ఈ సిరీస్‌ను మరోమారు తిరిగి తీసుకురావడం ద్వారా మేము చాలా సంతోషంగా ఉన్నాము’’ అని రఘు రెడ్డి, చీఫ్ బిజినెస్ ఆఫీసర్, షావోమీ ఇండియా అన్నారు.
‘‘రెడ్మీ కె 50ఐ 5జీ అత్యంత శక్తివంతమైన రెడ్మీ. వినియోగదారులు కోరుకునే ప్రతి అంశమూ దీనిలో ఉంది. సాటిలేని రీతిలో శక్తివంతమైన ప్రాసెసర్ నుంచి అత్యధిక రిఫ్రెష్ రేట్ డిస్ప్లేలు నుంచి అసాధారణ కెమెరాలు, బ్యాటరీ లైఫ్ వరకూ మరియు సూపర్‌ఫాస్ట్ చార్జింగ్ సైతం దీనిలో ఉంది. ఇది అసాధారణ పనితీరు కలిగి ఉండటంతో పాటుగా ఎలాంటి రాజీపడని పనితీరును అందిస్తుంది. రెడ్మీ ఉపకరణాలకు అత్యుత్తమంగా తగినట్లుగా అత్యంత అందుబాటు ధరలో సైతం లభిస్తుంది. ఇది సాంకేతికతను విప్లవాత్మకంగా మార్చడం మాత్రమే కాదు, అందుబాటు ధరలో సైతం మలవాలనే మా నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుంది’’ అని అన్నారు.
అసాధారణ పనితీరు..
రెడ్మీ కె 50ఐ 5జీని అసాధారణ పనితీరు కలిగిన స్మార్ట్‌ఫోన్‌గా మలిచే అంశం దీనిలోని ప్రాసెసర్. ఈ ఫోన్‌కు హృదయంలా మీడియా టెక్ డైమెన్శిటీ 8100 ప్రాసెసర్ ఉంటుంది. దీనిని టీఎస్ఎంసీ ఎన్ 5 (5ఎన్ఎం –క్లాస్) ప్రాసెస్‌తో తీర్చిదిద్దారు. ఇది నాలుగు ఏఆర్ఎం కోర్టెక్స్ ఏ78 సూపర్ కోర్స్‌తో వస్తుంది. దీనితో పాటుగా నాలుగు ఏఆర్ఎం కోర్టెక్స్ ఏ55 సామర్థ్యపు కోర్స్‌తో వస్తుంది. తద్వారా శక్తివంతమైన పనితీరు మరియు శక్తి సామర్థ్యం నడుమ సమతుల్యతతో వస్తుంది. ఈ ఫలితంగా, ఈ ప్రాసెసర్ తన వద్దకు వచ్చే ఏ అంశాన్ని అయినా నిర్వహించగలుగుతుంది. ఇది అంటుటు స్కోర్స్ సైతం అందిస్తుంది. ఇది మార్కెట్లో అందుబాటులోని ఫ్లాగ్షిప్ చిప్సెట్ల కంటే అధికంగా ఉంటుంది. ఈ అసాధారణ పనితీరుకు మద్దతునందిస్తూ స్పీడీ ఎల్పీడీడీఆర్5 ర్యామ్ మరియు యుఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి. ఇది వేగం మరియు మృదువైన మల్టీటాస్కింగ్ అందిస్తుంది. ఇది డజన్ల కొద్దీ యాప్‌లు మధ్య మల్టీ టాస్కింగ్ లేదంటే వీడియో ఎడిటింగ్, చిత్రాల ఎడిటింగ్ లేదా బీజీఎంఐ యొక్క తీవ్రమైన సెషన్లు, జెన్షిన్ ఇంపాక్ట్ మరియు అస్ఫాల్ట్ రేసింగ్ ఏదైనా సరే రెడ్మీ కె 50ఐ 5జీ అసాధారణ పనితీరుతో పూర్తి సౌక్యర్యంగా ఉంటుంది. ఈ ఫోన్ లిక్విడ్ కూల్ 2.0తో వస్తుంది. దీనిలో 7 లేయర్ల గ్రాఫైట్ షీట్ ఉంటుంది. మీరు ఎంత భారీ టాస్క్ లో ఉన్నప్పటికీ ఫోన్ కూల్‌గా ఉందన్న భరోసా అందిస్తుంది.
అత్యంత మృదువైన డిస్ప్లే
పనితీరుకు అదనపు హంగులను జోడిస్తూ దీనిలో 16.7 సెంటీమీటర్లు (6.6అంగుళాలు) ఫుల్ హెచ్డీ+ లిక్విడ్ ఫీల్డ్ ఫ్రింజ్ స్విచ్చింగ్ (ఎఫ్ఎఫ్ఎస్) డిస్ప్లే ఉన్నాయి. డాల్బీ విజన్‌కు మద్దతునందిస్తున్న మొట్టమొదటి ఉపకరణంగా దీనిలో 100 శాతం డీసీఐ–పీ3 గాముట్ కవరేజీ ఉన్నాయి. ఇది ఒక బిలియన్ కలర్స్‌కు మద్దతునందిస్తుంది. దీనిలో మార్కెట్లో సుప్రసిద్ధ 144 హెర్ట్జ్ 7 స్టేజ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఉంది. ఈ డిస్ప్లే మృదువుగా రిఫ్రెష్ రేట్స్ మధ్య మారుతుంది మరీ ముఖ్యంగా ప్రదర్శితమయ్యే కంటెంట్‌ను అనుసరించి ఇది ఉంటుంది. అదే సమమంలో బ్యాటరీ జీవితం సైతం కాపాడుతుంది. ఫీల్డ్ ఫ్రింజ్ స్విచింగ్ , డిస్ప్లే అత్యుత్తమ లైట్ ట్రాన్స్మిటెన్స్ అందించడంతో పాటుగా అత్యుత్తమ కలర్ రీ ప్రొడక్షన్, విస్తృత శ్రేణివ వీక్షణ కోణాలు అందిస్తూనే దీనిని శక్తివంతంగా మారుస్తుంది.
రెడ్మీ కె 50ఐ 5జీ అసాధారణ మల్టీమీడియాను సైతం అందిస్తుంది. ఈ ఫోన్ డాల్బీ అట్మాస్ మద్దతు కలిగి ఉంది. అలాగే హై–రైజ్ వైర్డ్ మరియు వైర్లెస్ ఆడియో మద్దతు సైతం ఉంది. దీనిలో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉండటం వల్ల అత్యద్భుతమైన సౌండ్ ఉంటుంది. ఇది 3.5 ఎంఎం ఆడియో జాక్ ను వైర్డ్ హెడ్‌ఫోన్స్ వాడాలనుకునే వారికోసం కలిగి ఉంది. ఈ 3.5ఎంఎం ఆడియోజాక్కు సైతం మద్దతునం దిస్తుంది. ఇది సాధారణ ఇయర్ ఫోన్స్‌కు మద్దతునందించడం మాత్రమే కాదు, అత్యంత శక్తివంతమైన హెడ్‌ఫోన్స్‌కు సైతం మద్దతునందిస్తుంది. దీని ఔట్పుట్ సామర్ధ్యం 32 ఓమ్స్ వద్ద 500ఎంవీ గా ఉంది.ఆడియో ఫైల్స్ తమ డీఏసీలను వెనుక్కి నెడతాయి ! ఈ అనుభవాలను మరింత ఉన్నత స్ధాయికి తీసుకువెళ్తూ, రెడ్మీ కె 50ఐ 5జీ లో డ్యూయల్ వాయిస్ అసిస్టెంట్ సైతం ఉంది. తద్వారా ఈ ఫోన్‌ను తెలివైన, వినోద భాగస్వామిగా మారుస్తుంది.
రెడ్మీ కె 50ఐ 5జీ లో వినూత్నమైన ఉపకరణాలు ఉన్నాయి. వీటి ద్వారా వినియోగదారులు తమ సొంత విప్లవాత్మక కంటెంట్‌ను తీర్చిదిద్దవచ్చు. ఈ ఫోన్ అత్యున్నత స్ధాయి ఫోటోగ్రఫీ పనితీరుకు అందిస్తుంది. దీనిలో ట్రిపుల్ కెమెరా అమరిక ఉంది. దీనిలో ప్లాగ్‌షిప్ స్థాయి 64 మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్ ఉంది. దీనికి 8మెగా పిక్సెల్ అలా్ట్రవైడ్ కెమెరా విస్తృత శ్రేణి కవరేజీ అందిస్తుంది . పరిస్ధితులు ఎంత తీవ్రంగా ఉన్నాయనే దానితో సంబంధం లేకుండా ఈ కెమెరాలు అత్యద్భుతమైన రంగులను అందిస్తాయి. వాటితో పాటుగా సవివరమైన చిత్రాలు, వీడియోలు సైతం చిత్రించగలవు. ఫోకస్ పీకింగ్, లాంగ్ ఎక్స్పోజర్, టైమ్ బరస్ట్ మరియు క్లోన్ వంటి సెట్టింగ్స్ ఈ కెమెరాలు కంటెంట్ క్రియేటర్ల డ్రీమ్‌గా మారతాయి. అంతేనా, ఇమేజింగ్ 780 ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసింగ్ శక్తి తో ఈ డివైజ్ నుంచే ఒకరు చిత్రాలను తీయడం, ఎడిట్ చేయడం, షేర్ చేయడం చేయవచ్చు.
రెడ్మీ కె 50ఐ 5జీ నిజానికి ఇండియా రెడీ 5జీ ఉపకరణం. ఈ పదంకు తగినట్లుగా ఈ ఫోన్లో ఎంపికలున్నాయి. రెడ్మీ ఉపకరణాలలో 12 5జీ బ్యాండ్స్‌కు మద్దతునందించే మొట్టమొదటి డివైజ్ ఇది. దీనిని అత్యంత ఆకర్షణీయమైన ఫలితాలతో పరీక్షించారు. రిలయన్స్ జియో సహకారంతో ఔట్ ఆఫ్ ల్యాబ్ సెటప్‌లో 5జీ నెట్‌వర్క్‌ను పరిశీలించడం జరిగింది.
‘‘ఎంతోకాలంగా 5జీ అనేది ఓ పదంగా లేదంటే ఫోన్ల ప్రమాణాల పత్రంలో ఓ నెంబర్లా మాత్రమే ఉంది. కానీ రెడ్మీ కె 50ఐ 5జీతో ఇది 5జీ అని పేరుగా మాత్రమే కాదు పనితీరు పరంగా కూడా అదే తరహా ప్రదర్శన అందిస్తుంది. ఇది వాస్తవ సమయంలో పరీక్షించబడటంతో పాటుగా పూర్తి స్ధాయిలో పరీక్షించడం జరిగింది’’ అని రఘురెడ్డి అన్నారు. యాధృశ్చికంగా, రెడ్మీ కె 50ఐ 5జీ లో తాజా కనెక్టివిటీ మాత్రమే ఉండటం కాకుండా సంప్రదాయ అంశాలకు సైతం ఇది మద్దతునందిస్తుంది. మరీ ముఖ్యంగా ఇన్ఫ్రా రెడ్ మద్దతు అందిస్తుంది. రెడ్మీ స్టాపెల్తో వినియోగదారులు తమ ఫోన్‌ను రిమోట్‌గా వాడవచ్చు !
ఈ అత్యున్నత పనితీరు కలిగిన ఉపకరణం సుదీర్ఘకాలపు బ్యాటరీ కలిగి ఉంటుంది. దీనిలో భారీ 5080 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 1999రూపాయల విలువ కలిగిన 67వాట్ టర్బో చార్జర్‌ను బాక్స్‌తో పాటుగా కలిగి ఉంటుంది. దీనిలోని భారీ బ్యాటరీ కారణంగా రోజంతా పలు కార్యక్రమాలు చేయడంతో పాటుగా మరింతగా వినియోగించవచ్చు. దీని చార్జర్‌తో కేవలం 46 నిమిషాలలో పూర్తిగా చార్జ్ అవుతుంది. నిజానికి 15 నిమిషాలు చార్జ్ చేస్తే రోజంతా ఫోన్‌ను వినియోగదారులు వాడవచ్చు. ఈ ఫోన్‌ను వినియోగించడమే ఆహ్లాదకరమైన అనుభవాలను అందిస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 పై నడుస్తుంది. దీనిలో ప్రతిష్టాత్మకమైన ఎంఐయుఐ 13 ఇంటర్ఫేజ్ ఉంది. ఇది వినియోగదారులకు అన్వేషించేందుకు బహుళ ఫీచర్లను సైతం అందిస్తుంది.
ఇదంతా కూడా అత్యంత అందంగా తీర్చిదిద్దిన, ధృడమైన డిజైప్లో ఉంటుంది. రెడ్మీ కె 50ఐ 5జీ స్మార్ట్‌ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో వస్తుంది. దీనిలో ఐపీ53 రేటింగ్ ఉంది. అసాధారణ వాతావరణ పరిస్థితులలో ఇది అత్యుత్తమ సహచరిగా నిలుస్తుంది. ఈ ఫోన్లో మూడు చూడగానే ఆకట్టుకునే రంగులు– క్విక్ సిల్వర్, స్టీల్త్ బ్లాక్ మరియు ఫాంటమ్ బ్లూ ఉన్నాయి.
ఇది అతి సన్నగా ఉంటుంది. ఇది స్మార్ట్ గా ఉండటంతో పాటుగా అన్ని శాఖల్లోనూ అసాధారణ పెర్ఫార్మర్గా నిలుస్తుంది. ఎలాగైతే మొదటి రెడ్మీ కె సిరీస్ ఫోన్లు వినియోగదారుల అంచనాలను మర్చాయో అదే రీతిలో ఆ సిరీస్‌లోని ఈ స్మార్ట్‌ఫోన్ కూడా అద్భుతాలు చేస్తుంది.
రెడ్మీ బడ్స్ 3 లైట్
రెడ్మీ ఇండియా అత్యంత వేగంగా తమ ఆడియో పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ అత్యాధునిక ఇయర్ బడ్స్‌ను రెడ్మీ బడ్స్ 3 లైట్ శీర్షికన విడుదల చేసింది.
సాధారణ టీడబ్ల్యుఎస్ గుంపునకు భిన్నంగా రెడ్మీ బడ్స్ 3 లైట్ ఉంటుంది. అత్యంత ఆకర్షణీయమైన డిజైన్ ఇవి కలిగి ఉండటంతో పాటుగా కేవలం 35 గ్రాముల బరువు మాత్రమే కలిగి ఉంటాయి. ఇవి రెడ్మీ యొక్క మొట్టమొదటి డబుల్ టియర్డ్ సిలికాన్ ఇయర్‌బడ్స్ మరియు లిటరల్‌గా మీ చెవులలో అవి కలిసిపోతాయి. ఇవి సుఖవంతంగా ఉన్నప్పటికీ సురక్షితంగా ఉంటాయి మరియు సౌకర్యవంతంగానూ ఉంటాయి. మీరు వీటిని ఆన్ చేసి, సంగీత ప్రపంచంలో గంటల తరబడి లీనమైపోవచ్చు. వీటిలో 6 మిల్లీమీటర్ల డైనమిక్ డ్రైవర్ ఉంది. వీటిని ప్రత్యేకంగా షావోమీ సౌండ్ ల్యాబ్‌లో ట్యూన్ చేయడం ద్వారా అత్యుత్తమ శ్రేణి ఆడియో నాణ్యతను అందిస్తుంది.
రెడ్మీ బడ్స్ 3 లైట్ లో అత్యాధునిక బ్లూటూత్ 5.2 కనెక్టివిటీ ఉంది. అలాగే ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ఈఎన్సీ) ఫీచర్ ఉంది. ఇది స్థిరమైన, వేగవంతమైన కనెక్టివిటీని అందిస్తుంది. అలాగే క్రిస్టల్ క్లియర్ కాలింగ్ అనుభవాలను ఇది అందించడంతో పాటుగా బ్యాటరీ వినియోగంపై కూడా మీరు ఓ నజర్ వేసే అవకాశం అందిస్తుంది. పూర్తిగా చార్జ్ చేసినప్పుడు రెడ్మీ బడ్స్ 3 లైట్ 5 గంటల పాటు ఏకధాటిగా సంగీతం ఆస్వాదించే అవకాశం అందిస్తుంది. అలాగే కేస్‌తో 18 గంటల పాటు ఆడియో ఆస్వాదించవచ్చు. ఈ రెండు బడ్స్ మరియు కేస్‌లో ఎల్ఈడీ ఇండికేటర్స్ ఉండటం వల్ల కనెక్టివిటీ మరియు బ్యాటరీ స్టాటస్ కూడా వినియోగదారులు చూడవచ్చు. బ్యాటరీ చార్జింగ్ చాలా వేగంగా జరుగుతుంది. దీని యుఎస్బీ టైప్ సీ కనెక్టివిటీకు ధన్యవాదములు. రెడ్మీ బడ్స్ 3 లైట్ చార్జింగ్ కూడా అత్యంత సులువుగా ఉంటుంది. పది నిమిషాల చార్జింగ్‌తో 100నిమిషాల సంగీతం ఆస్వాదించవచ్చు.
రెడ్మీ బడ్స్ 3 లైట్ లో ఐపీ54 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్ ఉంది. ఇది జిమ్‌తో పాటుగా ఔట్‌డోర్స్ కు అత్యుత్తమ భాగస్వామిగా నిలుస్తుంది.
ధర మరియు లభ్యత
రెడ్మీ కె50ఐ 5జీ 6జీబీ +128 జీబీ వేరియంట్ ధర25,999 రూపాయలు కాగా, 8జీబీ +256 జీబీ వేరియంట్ ధర 28,999 రూపాయలు. ఇది ఆన్లైన్, ఆఫ్‌లైన్ మార్గాలలో ఎంఐ డాట్ కామ్, ఎంఐ హోమ్, అమెజాన్ డాట్ ఇన్ లో లభ్యమవుతుంది. వినియోగదారులు నూతన రెడ్మీ కె50ఐ 5జీ ని ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద 20,999* రూపాయలు(6జీబీ+128 జీబీ) మరియు 23,999* రూపాయలు (8జీబీ+256జీబీ) లలో 23 జూలై 2022 నుంచి లభ్యమవుతుంది.
రెడ్మీ బడ్స్ 3 లైట్ ధర 1999 రూపాయలు. ఇది ఎంఐ డాట్ కామ్, ఎంఐ హోమ్, అమెజాన్ డాట్ ఇన్‌పై 31 జూలై 2022 నుంచి లభ్యమవుతుంది. వినియోగదారులు ఎర్లీబర్డ్ ఆఫర్ 500 రూపాయలను సైతం పొందవచ్చు.
* ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులు మరియు ఈఎంఐ ఆఫర్లు.