Authorization
Mon Jan 19, 2015 06:51 pm
క్యాంపస్ లోపల బీపీడీపీ కు చెందిన విద్యార్థులు దేశీయంగా కారును తీర్చిదిద్దారు
ఇండియన్ ఫార్ములా స్టూడెంట్ స్టైల్ ఇంజినీరింగ్ డిజైన్ పోటీ ఎఫ్ఎస్ భారత్‌లో పోటీ
బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్(బీపీడీసీ)లోని భారతీయ విద్యార్థులు కేవలం యుఏఈ మాత్రమే కాకుండా మొత్తం మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలకు ప్రాతినిధ్యం వహించారు.
హైదరాబాద్, జూలై 25, 2022: మరోమారు తమ సత్తా చాటుతూ బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లోని భారతీయ విద్యార్థులు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫార్ములా స్టూడెంట్ నెదర్లాండ్స్ 2022 పోటీ (ఎఫ్ఎస్ఎన్)లో మూడో స్థానంలో నిలిచారు. ఎం.ఏ.హెచ్.వై ఖూరీ అండ్ కో ఎల్ఎల్సీ సహకారంతో బిట్స్ దుబాయ్ మోటర్‌స్పోర్ట్స్ క్లబ్‌కు చెందిన 14 మంది భారతీయ విద్యార్థులతో కూడిన టీమ్ అల్ ఫర్సాన్, ఫార్ములా స్టూడెంట్ నెదర్లాండ్స్ 2022 కు మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా ప్రాంతాల నుంచి ఎన్నికైన ఒకే ఒక్క బృందం. ఇక్కడ ప్రపంచ వ్యాప్తంగా పలు యూనివర్శిటీల నుంచి ఎన్నికైన 18 టీమ్‌లతో ఈ బృందం పోటీ పడింది.
బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసన్ మడపుసి మాట్లాడుతూ 'కెరీర్ మీద దృష్టి సారించి విద్యనందించడం వల్లనే మిగిలిన వారికి భిన్నంగా బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్ నిలుస్తుంది. ఎఫ్ఎస్ఎన్ లాంటి పోటీలతో మా విద్యార్థులు , వాస్తవ ప్రపంచపు వర్క్ అనుభవాన్ని గ్రాడ్యుయేషన్‌కు ముందుగానే పొందుతున్నారు. యూరోపియన్ మరియు అంతర్జాతీయ స్థాయిలో జరిగే అతిపెద్ద పోటీ ఎఫ్ఎస్ఎన్ . ఈ విజయం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము` అని అన్నారు. 'ఎన్నో కష్టాలనెదుర్కొని ఈ విద్యార్థులు ప్రాజెక్టును సమయానికి పూర్తి చేశారు. ఈ విద్యార్థులలో ఇద్దరు తమ వేసవి ఇంటర్న్‌షిప్ చేస్తూ తమ ప్రణాళికలను గురించి చెప్పారు. వారిని మేము ప్రోత్సహించడంతో సవాల్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటుగా ఈ పోటీలో విజయం సాధించారు` అని అన్నారు.
ఈ బృంద సభ్యుడు శోభల్ ఫిలిప్ రాయ్ మాట్లాడుతూ 'ఈ కారును 9 నెలల పాటు ప్రణాళిక చేసి, తీర్చిదిద్దాము. మా టీమ్ మద్దతు అందించడంతో పాటుగా ఈ కారు అభివృద్ధిలో అణువణువూ తోడ్పడ్డారు. రాబోయే సంవత్సరాలలో మరిన్ని కార్లను అభివృద్ధి చేయనున్నాము. ఇవి పూర్తి పర్యావరణ అనుకూలంగా ఉంటాయి` అని అన్నారు.