Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారత్‌లో తమ కార్యకలాపాల నుంచి వైదొలుగుతున్నట్లు చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు హువావే ప్రకటించింది. ఈ కంపెనీ ప్రస్తుతం భారత్‌లో హానర్ బ్రాండ్‌తో అమ్మకాలు చేస్తోంది. ఇకపై తమ బ్రాండ్ ఉత్పత్తుల తయారీ, అమ్మకాలు జరపబోమని ఆ కంపెనీ తెలిపింది. అన్నీ నిబంధనలకు లోబడే స్థానిక భాగస్వాములతో కలిసి భారత్‌లో కార్యకాలాపాల్ని నిర్వహించామని హానర్ సిఇఒ ఝావో మింగ్ తెలిపారు. స్పష్టమైన కారణాలతో ఇక్కడ వ్యాపారాన్ని వద్దని అనుకున్నామని అని తెలిపారు. అయితే ఆ కారణలేంటో ఆయన వెల్లడించలేదు. ఇటీవల వివో, ఒప్పో, షావోమీ తదితర కంపెనీలపై ఇడి అధికారులు దాడులు చేస్తున్న తరుణంలో హువావే ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.