Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో ఏప్రిల్ నుంచి జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో దేశంలో నికర పన్ను వసూళ్లు 24 శాతం పెరిగి రూ.7 లక్షల కోట్లకు చేరాయి. ఇదే విషయాన్ని సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ లోకసభకు లిఖితపూర్వకంగా వెల్లడించారు. ఇదే సమయంలో నికర పరోక్ష పన్నుల వసూళ్లు 9శాతం పెరిగి రూ.3.44 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ప్రత్యక్ష పన్నులు ఏకంగా 41 శాతం ఎగిసి రూ.3.55 లక్షల కోట్లుగా చేరాయి. కరోనా అనంతరం ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోవడం ద్వారానే పన్ను రాబడి పెరిగిందని మంత్రి పంకజ్ చౌదరీ పేర్కొన్నారు. దేశ ప్రజలపై ఇబ్బడిమబ్బడిగా బాదుతున్న పెట్రో, ఇంధన, జిఎస్టి సుంకాల వల్లే పన్నుల్లో పెరుగుదల చోటు చేసుకుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.