Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 11 శాతం పతనం
ముంబయి : ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో షేర్లు కుప్పకూలాయి. ఈ కంపెనీ లిస్టింగ్‌లోకి వచ్చిన తర్వాత ఏడాది పాటు లాక్ ఇన్ పీరియడ్‌లో ఉన్న 613 కోట్ల షేర్లను విక్రయించుకోవడానికి వెసులుబాటు కలిగింది. ఇంతకాలం ఈ మొత్తం షేర్లు వ్యవస్థాపకులు, ఇతర కీలక ఇన్వెస్టర్ల ఖాతాల్లో ఉన్నాయి. కాగా..సోమవారం సెషన్లో బిఎస్ఇలో ఈ సూచీ 11.28 శాతం పతనమై రూ.47.60 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఏకంగా 14 శాతం విలువ కోల్పోయింది. పబ్లిక్ ఇష్యూలో ఈ షేర్‌ను రూ.76 చొప్పున కేటాయించారు. గతేడాది జులై 23న 51 శాతం ప్రీమియంతో రూ.115 వద్ద నమోదయ్యింది. తర్వాత రోజుల్లో ఏకంగా రూ.169 గరిష్ట స్థాయికి చేరగా.. ఇటీవల ఆ సూచీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటుంది.