Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ ఏడాది 7.4 శాతమే వృద్ధి
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) భారత వృద్ధి రేటు అంచనాలకు కోత పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7.4 శాతానికే పరిమితం కావొచ్చని అంచనా వేసింది. ఇంత క్రితం అంచనాలతో పోల్చితే 80 బేసిస్ పాయింట్లు తక్కువ. విదేశీ పరిస్థితులకు తోడు సెంట్రల్ బ్యాంక్ పాలసీ విధానాన్ని కఠినతరం చేయడంతో వృద్ధి మందగించనుందని పేర్కొం ది. 2022లో ప్రపంచ వృద్ధిరేటు 3.2 శాతానికి తగ్గొచ్చని తెలిపింది. ప్రపంచ దేశాల ఆర్థిక ప్రగతి క్షీణించడమే ఇందుకు కారణమని పేర్కొ ంది. 2023లో కొన్ని దేశాల ఆర్థిక పరిస్థితి మరీ దిగజా రొచ్చని తెలిపింది. 2023లో అమెరి కా ఆర్థిక వ్యవస్థ పెరుగుదల ఏకంగా 0.6 శాతానికి మందగించొచ్చని అంచనా వేసింది. ఆర్థిక సంక్షోభం ప్రధాన సవాల్‌గా నిలువనుందని పేర్కొంది. ముఖ్యంగా చైనా, అమెరికా, భారత్ దేశాల్లో మందగింపు ప్రపంచవృద్ధి రేటును దెబ్బతీయనుందని అంచనా వేసింది. ద్రవ్యోల్బణ కట్టడికి అభివృద్ధిచెందిన దేశాల సెంట్రల్ బ్యాంక్‌లు వడ్డీ రేట్లను పెంచుతున్నాయని తెలిపింది. అభివృద్ధి చెందు తున్న దేశాలు కూడా అదే బాటలో నడుస్తున్నాయని పేర్కొంది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ద్రవ్యోల్బణం తగ్గించడమే కీలకమని సూచించింది. ఇందుకోసం కఠిన పరపతి విధానం సరైందేనని పేర్కొంది. దీంతో భవిష్యత్తులో వృద్ధికి బాటలు వేయవచ్చని తెలిపింది.
దేశంలో నమోద వుతున్న అధిక ద్రవ్యో ల్బణం వృద్థి రేటుకు విఘాతంలా మారనుందని ఏసియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ఇటీవలే విశ్లేషించింది. అధిక ధరలకు తోడు ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచిన ప్రభావంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో 7.2 శాతానికి పరిమితం కావొచ్చని అం చనా వేసింది. ఇంతక్రితం ఈ అంచనా 7.5 శాతంగా ఉంది. 2023 లో జీడీపీ 4.7 శాతానికే పరిమితం కావొచ్చని ఇటీవల నోమురా పేర్కొ నగా.. మోర్గాన్ స్టాన్లే కూడా ఇదే బాటలో విశ్లేషణలు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో భారత జీడీపీ 7.2శాతానికి పరిమి తం కావొచ్చని పేర్కొంది. ఇంతక్రితం అంచనాలతో పోల్చితే 40 బేసిస్ పాయింట్లు తగ్గుదల.