Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అకాయ్ యొక్క సహజసిద్ధమైన వెబ్ఓఎస్ పోర్ట్‌ఫోలియో హెచ్డీ నుంచి 4కెను సహజసిద్ధమైన అనుభవాలతో అందిస్తుంది. దీనిలో మ్యాజిక్ రిమోట్, ఎక్స్‌ప్లోరర్, థింక్యు ఏఐ ఉన్నాయి
అకాయ్ యొక్క అత్యంత ఆకర్షణీయమైన వెబ్ఓఎస్ సిరీస్ ధరను అత్యంత అందుబాటులో 39,990 రూపాయలుగా నిర్ణయించారు.
హైదరాబాద్, 27 జూలై 2022: అకాయ్ తమ నూతన శ్రేణి 4కె, ఎఫ్‌హెచ్‌డీ మరియు హెచ్డీ స్మార్ట్‌టీవీలను విప్లవాత్మక వెబ్ఓఎస్తో విడుదల చేసింది. అకాయ్ శ్రేణి టీవీలు కంటెంట్ అన్వేషణను మరే ఇతర టీవీలలోనూ ఆస్వాదించని రీతిలో ఆస్వాదించే అవకాశం అందిస్తాయి. మ్యాజిక్ రిమోట్ మరియు థింక్యు ఏఐతో జత కలవడంతో పాటుగా అన్ని రకాల వినోద అవసరాలకూ ఏకైక పరిష్కారంగా నిలుస్తుంది. అలెక్సా కు థింక్యు ఏఐ మద్దతునందించడంతో పాటుగా టీవీ స్ట్రీమింగ్, సెర్చింగ్, బ్రాడ్కాస్ట్ ఛానెల్ వీక్షణ అనుభవాలను సైతం సులభతరం చేస్తుంది.
అకాయ్ 55 అంగుళాల వెబ్ఓఎస్ 4కె యుహెచ్డీను అత్యంత ఆకర్షణీయంగా 39,990 రూపాయలలో అందిస్తున్నారు. కేవలం 3999 రూపాయల ప్రారంభ ధరతో బజాజ్ ఫైనాన్స్, పైన్‌ల్యాబ్స్, కొటక్ మరియు తదితర బ్యాంక్ భాగస్వాముల నుంచి ఈఎంఐ అవకాశాలు కూడా పొందవచ్చు.
అకాయ్ వెబ్ఓఎస్ స్మార్ట్ టీవీ శ్రేణిలో 55 అంగుళాలు , 50 , 43 మరియు 32 అంగుళాల టీవీ వేరియంట్లు కూడా ఉన్నాయి. ఇవి అత్యంత ఆకర్షణీయంగా మరియు ఆకట్టుకునే రీతిలో ఉండటంతో పాటుగా వినియోగించడానికి అనువైన ఫీచర్లతో ప్రీమియం అనుభవాలను సైతం అందిస్తాయి. అకాయ్ వెబ్ ఓఎస్ టీవీలు హెచ్డీఆర్ 10 హెచ్ఎల్జీ ; డాల్బీ ఆడియో, డ్యూయల్ బ్యాండ్ వైఉఫై, 2 వే బ్లూ టూత్ 5.0, స్ర్కీన్ మిర్రరింగ్, ఎంఈఎంసీ, 4కె అప్‌స్కేలింగ్, ఏఎల్ఎల్ఎం, 1.5జీబీ రామ్, 8జీబీ రోమ్తో వస్తుంది. వినియోగదారులు ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, జీ5, సోనీలివ్, హాట్‌స్టార్, యాపిల్ టీవీ మొదలైన ఓటీటీలు పొందవచ్చు.
అకాయ్ ఇండియా డైరెక్టర్ అనురాగ్ శర్మ మాట్లాడుతూ 'అకాయ్ వద్ద మా లక్ష్యం ఎప్పుడూ కూడా మీ జీవితాలకు అదనపు విలువ జోడించడం. ప్రతి రోజూ వినూత్నమైన రీతిలో నూతన ఫీచర్లను కనుగొనడంతో పాటుగా వినోద ప్రపంచాన్ని అన్వేషించడానికి అత్యంత అనువైన ప్రాంగణంగా మారుస్తున్నాము` అని అన్నారు.