Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డా.శరత్ పుట్టారెడ్డి, హెపాటో, చీఫ్ ట్రాన్స్ ప్లాంట్ ఫిజీషియన్, కిమ్స్, హైదరాబాద్
హెపటైటిస్ అంటే, కాలేయానికి వచ్చే వాపు. ప్రస్తుతం 5 రకాల హెపటైటిస్ వైరస్లు ఉండగా, వాటిని ఎ, బి, సి, డి, ఇ అని వర్గీకరించారు. హెపటైటిస్ బి, సి తీవ్రమైనవి. రక్తం ద్వారా కాలేయానికి ఇన్ఫెక్షన్స్ కలిగించే వాటిని వైరల్ ఇన్ఫెక్షన్లుగా పరిగణిస్తారు. భారతదేశంలో హెపటైటిస్ బి సర్ఫేస్ యాంటిజెన్ (HBsAg) ప్రమాణం 40 మిలియన్లకు పైగా హెచ్బివి బాధితుల్లోనే 3-4.2% మేర ఉంది. ప్రతి ఏడాది 1,15,000కు పైగా భారతీయులు హెపటైటిస్ బి మరియు దానికి సంబంధించిన సమస్యలతో మరణిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ తెలిసిన 10 హెచ్బివి జినోటైప్స్ ఉండగా, వాటిని ఎ నుంచి జె వరకు వర్గీకరించారు; వాటిలో భారతదేశంలో అత్యంత సామాన్యమైన జినోటైప్ డి, అనంతరం ఎ, సి ఉన్నాయి. దేశంలో హెచ్సివి ఇన్ఫెక్షన్ ప్రమాణం 0.5% నుంచి 1.5% వరకు ఉంది. తక్కువ వ్యాప్తి కలిగి ఉన్నప్పటికీ భారతదేశంలోని జనాభాను పరిగణనలోకి తీసుకుంటే హెచ్సివి గమనార్హమైన ప్రమాణంలో ఎక్కువ మంది సమస్యలను ఎదుర్కొంటున్నారు. భారతదేశంలో 12-18 మిలియన్ల ప్రజలు హెచ్సివి ఇన్ఫెక్షన్ బాధితులు ఉండగా, సుమారుగా వైరమిక్ ప్రమాణం 80% వరకు ఉండగా, 0.68% వైరమిక్ వ్యాప్తిని కలిగి ఉంది. ఇతర వైరస్ల కన్నా హెపటైటిస్ బి లేదా సి వైరస్ వ్యక్తిని హెపటైటిస్ బి లేదా సి ఇన్ఫెక్షన్ బారిన పడేలా చేస్తుంది. ఈ వైరస్లు కాలేయంలో వాపును కలిగిస్తాయి.
జులై 28, 2022 ప్రపంచం ‘ఐ కాంట్ వెయిట్’ అనే థీమ్‌తో హెపటైటిస్ రోజును ఆచరిస్తున్న నేపథ్యంలో వైరల్ హెపటైటిస్ గ్లోబల్ భారానికి సంబంధించిన అవగాహనను వృద్ధి చేసేందుకు పెద్ద పీట వేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ఇతర సంస్థల సహకారంతో హెపటైటిస్‌ను ప్రాథమిక ఆరోగ్య సౌకర్యాలు మరియు సముదాయాలకు చేరువగా తీసుకు వచ్చేందుకు కొత్త తరహా చర్యలకు పిలుపునివ్వగా, దీనితో అన్ని రకాల హెపటైటిస్ రోగులకు చికిత్స మరియు సంరక్షణ సులభంగా లభించేలా చేస్తుంది. అలాగే 2030 నాటికి హెపటైటిస్ రహిత ప్రపంచాన్ని అందించే దిశలో ప్రపంచ ఆరోగ్య సంస్థ 90% మేర కొత్త హెపటైటిస్ బి, సి ఇన్ఫెక్షన్లను తగ్గించే లక్ష్యాన్ని కలిగి ఉంది; లివర్ సిరోసిస్‌తో హెపటైటిస్ సంబంధిత మరణాలు మరియు క్యాన్సర్ 65% మేర తక్కువ చేయడం; హెపటైటిస్ బి,సి వైరస్‌లను కనీసం 90% మేర ప్రజల్లో పరీక్షించడం, అర్హత పొందిన కనీసం 80% మందిలో సరైన చికిత్సలను అందించే లక్ష్యాన్ని కలిగి ఉంది.
వ్యక్తిగతంగా హెపటైటిస్ బి, సికు సంబంధించిన ప్రమాద కారకాలను ఒక్కొక్కటిగా పరిశీలిస్తే, హెపటైటిస్ బి ఎక్కువగా శరీర ద్రవాల ద్వారా సంక్రమిస్తుంది. ఇది హెపటైటిస్ బి- సోకిన తల్లి నుంచి జన్మించినప్పుడు లేదా చిన్నతనంలో శరీర ద్రవాలు, రక్తం లేదా కలుషితమైన వైద్య పరికరాలకు గురికావడం ద్వారా సంక్రమిస్తుంది. హెపటైటిస్ బి ఇంట్రానాసల్, ఇంజెక్షన్ డ్రగ్స్ వాడకంతో పాటు పచ్చబొట్లు మరియు బాడీ పియర్సింగ్ సమయంలో ఉపయోగించే సోకిన సాధనాల ద్వారా వ్యాపిస్తుంది. హెపటైటిస్ సికి ప్రధాన ప్రమాద కారకాలు, ఇంట్రానాసల్, ఇంజెక్షన్ డ్రగ్స్ వాడకం, పచ్చబొట్లు, బాడీ పియర్సింగ్‌లు, హై-రిస్క్ సెక్స్, రక్త మార్పిడి, అవయవ మార్పిడి. పలు సందర్భాలలో, హెపటైటిస్ బి అనేక దశాబ్దాలుగా క్రమంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, చాలా మంది రోగులకు దానికి సంబంధించిన ఎటువంటి లక్షణాలు కనిపించడం లేదు. కాలేయ సిర్రోసిస్ వంటి అధునాతన కాలేయ వ్యాధి ఉన్న వ్యక్తులు కాలేయ వైఫల్యాన్ని ప్రతిబింబించే సమస్యలు, లక్షణాలను కలిగి ఉండవచ్చు.
ఇతర లక్షణాలు:
· కడుపు వాపులకు కారణమయ్యేలా ద్రవాలు చేరడం
· గందరగోళం మరియు వణుకు (ఎన్సెఫలోపతి)
· వాంతుల్లో రక్తం లేదా మలంలో రక్తం
హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ రోగ నిర్ధారణ పరీక్షల్లో హెచ్బిఎస్ఎజికు ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే హెచ్బిఎస్ఎజి , ఇమ్యునోగ్లోబిలిన్ (IgM) ప్రకారం యాంటీబాడీల నుంచి కోర్ యాంటీజెన్ హెచ్బిసిఎజి (HBcAg) ద్వారా తీవ్రమైన హెచ్బివి ఇన్ఫెక్షన్ తెలుస్తుంది.
తీవ్రమైన హెపటైటిస్ సి ఉన్న పలువురిలో రోగ లక్షణాలు ఉండవు; అయితే కొందరిలో ఆయాసం మరియు కుడివైపు పొట్టలో అసౌకర్యం కనిపిస్తుంది. హెపటైటిస్ సిలో రోగ లక్షణాలు కాలేయంలో రోగం చివరి దశలో రోగికి లివర్ సిరోసిస్ లేదా కాలేయం వైఫల్యం అయినప్పుడు మాత్రమే బయటపడుతుంది. హెపటైటిస్ బి. సి సాధారణంగా ఎటువంటి నిర్దిష్ట రోగ లక్షణాలను కలిగి ఉండవు. వైరస్‌లను కలిగి ఉన్న పలువురికి అది ఉన్నట్లే తెలియదు.
హెపటైటిస్ బికు సాధారణంగా రోగులకు వారి హెచ్బివి స్థాయి వృద్ధి చెందినప్పుడు, ప్రయోగశాలలో పరీక్ష చేసినప్పుడు కాలేయంలో గమనార్హమైన వాపు లేదా గాయం కనిపించినప్పుడు చికిత్స అవసం అవుతుంది. ప్రస్తుతం ఏడు ఔషధాలను హెపటైటిస్ బి కోసం ఆమోదించారు. వాటిలో మొదటి దశ అనంతరం చికిత్సలు అని పరిగణించారు. ఈ ఔషధాలు రోజుకు రెండుసార్లు నోటి ద్వారా సేవించే ఔషధాలు కాగా, అవి వైరస్ ను దీర్ఘాకాలంలో అత్యంత తక్కువ ప్రమాణానికి లేదా గుర్తించలేని స్థాయిలను నివారించడంలో అత్యంత పరిణామకారిగా ఉన్నాయి.
ఈ చికిత్స లక్ష్యం దీర్ఘావధిలో వైరస్‌ను నియంత్రించడం, హెపటైటిస్ బి సంబంధిత సంకీర్ణతలైన సిరోసిస్ మరియు కాలేయం క్యాన్సర్‌ను తగ్గించడం. గత మూడేళ్లలో కనిపెట్టిన హెపటైటిస్ సి చికిత్సలు మౌఖిక ఔషధాలను ఇచ్చేందుకు ఆమోదం పలుకగా, సురక్షత, పరిణామకారిత్వంలో గమనార్హమైన మార్పులను సూచించింది. హెపటైటిస్ సి, 6 రకాలుగా ఉండడంతో రోగులు అత్యంత సూక్తమైన మౌఖిక ఔషధాన్ని పొందేందుకు వారి వైద్యులతో మాట్లాడాలి. చాలా మంది మౌఖిక థెరపీల ద్వారా ఉపశమనం లేదా మేలు అయ్యే శాతం 90% కన్నా ఎక్కువగా ఉంది మరియు 12 వారాల మేర తక్కువ అవధిని కలిగి ఉంది.
ఇంత చెప్పినా, ముఖ్యమైనది హెపటైటిస్‌ను ముందస్తుగా గుర్తించేందుకు ముందస్తు రోగ నిర్ధారణ, చికిత్స మరియు సంరక్షణ చాలా ముఖ్యమైనవి కాగా, అది సామూహిక ప్రయత్నాలతో ఎటువంటి మరణాలు సంభవించకుండా అడ్డుకుంటాయి. అన్నింటికన్నా ముఖ్యమైనది ప్రతి వ్యక్తి ఈ జాగృతి సందేశాన్ని ముందుకు తోడ్కొని వెళ్లాలి మరియు రోగులకు అవసరమైన సమయంలో మద్ధతుగా నిలవాలి.