Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో డాక్టర్ రెడ్డీస్ లాభాలు రెట్టింపై రూ.1,187.60 కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.570.80 కోట్ల లాభాలు ప్రకటించింది. దీంతో పోల్చితే క్రితం క్యూ1 లాభాల్లో 108 శాతం వృద్ధిని కనబర్చింది. ఇదే సమయంలో కంపెనీ రెవెన్యూ 6శాతం పెరిగి రూ.5,215.40 కోట్లుగా నమోదయ్యింది. 2021-22 ఇదే నాలుగో త్రైమాసికంలో రూ.4,919.40 కోట్ల రెవెన్యూ ఆర్జించినట్లు తెలిపింది. తమ కీలక వ్యాపారాలను, ఉత్పత్తిని మెరుగుపర్చుకోవడాన్ని కొనసాగిస్తామని డాక్టర్ రెడ్డీస్ కో ఛైర్మన్, యండి జివి ప్రసాద్ పేర్కొన్నారు.