Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూన్ త్రైమాసికంలో 169 ఇవి బస్సుల డెలివరీ
హైదరాబాద్ : దేశంలో ప్రముఖ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ 2022 జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో రూ.304.7 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసినట్టు ప్రకటించిం ది. గతేడాది ఇదే త్రైమాసికం ఆదాయం రూ.41.2 కోట్లతో పోల్చితే 640.4 శాతం పెరుగుదలను సాధించి నట్టు వెల్లడించింది. ఇదే సమయంలో రూ.2.0 కోట్ల లాభాలను నమోదు చేయగా.. గడిచిన క్యూ1లో ఏకంగా 825.2 శాతం వృద్థితో రూ.18.8 కోట్ల లాభాలు ఆర్జించినట్టు వెల్లడించింది. క్రితం జూన్ త్రైమాసికంలో 169 ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేయడంతో గణనీ యమైన ఆదాయ వృద్ధిని సాధించినట్టు తెలిపింది. గతేడాది ఇదే కాలంలో కేవలం 11 బస్సులను మాత్రమే డెలివరి చేశామని పేర్కొం ది. ''మా అవిశ్రాంత ప్రయత్నాల ఫలితంగా అనుకూలమైన ఫలితా లు అందివచ్చాయి. గత మూడు నెలల కాలంలో ఎలక్ట్రిక్ బస్సుల తయారీని వేగవంతం చేయడంతో పాటు డెలివరీలు రికార్డు స్థాయి 169కి పెరిగాయి. ఇదే ఉత్సాహాన్ని కొనసాగించి కొత్త పుంతలు తొక్క డానికి మరింతగా ప్రయత్నిస్తాం.'' అని ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ చైర్మన్, యండి కెవి ప్రదీప్ తెలిపారు.