Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెన్సెక్స్ 1041 పాయింట్ల వృద్ధి
ముంబయి: ఐటీ, బ్యాంకిం గ్ రంగాల సూచీల దన్నుతో స్టాక్ మార్కెట్లు పరుగులు పెట్టాయి. గురువారం కొనుగోళ్ల మద్దతుతో దలాల్ స్ట్రీట్ కళ కళలాడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 1041 పాయిం ట్లు రాణించి 56,857కు చేరింది. ఇదే బాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 288 పాయింట్లు పెరిగి 16,929 వద్ద ముగిసింది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును 100 బేసిస్ పాయింట్లు పెంచొచ్చని సంకేతాలు ఇచ్చి.. తుదకు 75 బేసిస్ పాయింట్లు మాత్రమే హెచ్చించడంతో అక్కడి మార్కెట్లు భారీగా లాభపడటం ఇతర దేశాల మార్కెట్లలో విశ్వాసాన్ని పెంచాయి. అదే విధంగా ఎఫ్ఐఐలు తిరిగి రావడం, అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో నిఫ్టీలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ రంగాల షేర్లు లాభాలను గడించాయి.
రెండేండ్ల కనిష్టానికి స్పెస్‌జెట్ సూచీ
స్పైస్‌జెట్ విమానాల్లో ఇటీవల వరుస సంకేతిక ఘటనలు చోటు చేసుకోవడంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. వచ్చే ఎనిమిది వారాల పాటు కేవలం 50 శాతం విమాన కార్యకలాపాలను సాగించాలని ఆదేశించింది. ఈ పరిణామంతో గురువారం ఆ కంపెనీ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురైయ్యా యి. ఓ దశలో 10 శాతం క్షీణించి.. రెండేళ్ల కనిష్టానికి పడిపో యాయి. తుదకు 3.52 శాతం పతనంతో రూ.36.95 వద్ద ముగిసింది.