Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్యూ1లో 80 శాతం వృద్థి
హైదరాబాద్: ప్లాస్టిక్ ప్యాకేజింగ్ రంగంలో ఉన్న మోల్డ్‌టెక్ ప్యాకేజింగ్ ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. 2022-23 జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం(క్యూ1)లో మోల్డ్‌టెక్ ప్యాకేజింగ్ నికరలాభం 80 శాతం వృద్ధితో రూ.22 కోట్లు సాధించింది. కంపెనీ చరిత్రలో ఇదే అత్యధికం. కంపెనీ టర్నోవర్ రూ.134 కోట్ల నుంచి రూ.208 కోట్లకు చేరిందని ఆ సంస్థ సీఎండీ జె లక్ష్మణ రావు తెలిపారు. 2022-23లో రూ.125 కోట్ల మూలధన వ్యయం చేయను న్నట్లు ప్రకటించారు. కంపెనీ ఉత్పత్తులకు భారీ డిమాండ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. అయిదేళ్ల సగటుతో పోలిస్తే ఈ మొత్తం రెండున్నర రెట్లు అధికమన్నారు. రోబోటిక్ ఐఎం ఎల్ సౌకర్యాలతో డామన్‌లో రూ.30 కోట్లతో రెండవ ప్లాంటు స్థాపించాలని బోర్డు నిర్ణయించిందని పేర్కొన్నారు.