Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) రూ.1,992 కోట్ల నష్టాలు చవి చూసినట్టు ప్రకటించింది. రిఫైనింగ్ మార్జిన్లు తగ్గడంతో పాటుగా పెట్రోల్, డీజిల్ ధరలను యథాతథంగా కొనసాగించడంతో నష్టాలు నమోదయినట్టు పేర్కొంది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.5,941.37 కోట్ల లాభాలు సాధించింది. ఇదే సమయంలో రూ.1.55 లక్షల కోట్లుగా ఉన్న కంపెనీ నిర్వహణ రెవెన్యూ.. గడిచిన ఏప్రిల్ - జూన్ కాలంలో రూ.2.51 లక్షల కోట్లుకు చేరింది. శుక్రవారం బీఎస్ఈలో ఐఓసీ షేర్ విలువ 1.18 శాతం పెరిగి రూ.72.95 వద్ద ముగిసింది.