Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నేడు ఆంధ్రప్రదేశ్లోని దేవాలయ పట్టణం తిరుమలలో తమ మొదటి శాఖ ను ప్రారంభించినట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ శాఖలో నూతన తరపు బ్యాంకింగ్ ఉత్పత్తులు మరియు సేవలను ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)ను సందర్శించే భక్తులకు అందించనుంది. ఈ శాఖను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీనియర్ అధికారుల సమక్షంలో టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఐడీఈఎస్ శ్రీ ఏ వీ ధర్మారెడ్డి ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో ఉన్న ఆధ్యాత్మిక పట్టణం తిరుమల. ఈ నూతన శాఖ తెరువడం ద్వారా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ శాఖల సంఖ్య ఇప్పుడు తిరుపతి జిల్లాలో 12 కు చేరింది. ఈ బ్యాంకుకు ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాల్లో 139 నగరాల్లో 262 శాఖలు ఉన్నాయి.
తిరుమలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మొదటి శాఖను గురించి తరుణ్ చౌదరి, బ్రాంచ్ బ్యాంకింగ్ హెడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మాట్లాడుతూ.. 'తిరుమలో మా మొదటి శాఖ పలు ప్రపంచ శ్రేణి బ్యాంకింగ్ ఉత్పత్తులు, సేవలను అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మా కార్యకలాపాలు విస్తరించాలని ప్రణాళిక చేశాము మరియు నాణ్యమైన బ్యాంకింగ్ ఉత్పత్తులు, సేవలను రాష్ట్రమంతా అందుబాటులో ఉంచాలనుకుం టున్నాము. మేము మా శాఖల నెట్వర్క్ను విస్తరించడం కొనసాగించాలనుకుంటున్నాము. మరీముఖ్యంగా రాష్ట్రంలో బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేని మరియు తక్కువ సేవలు లభిస్తున్న ప్రాంతాలపై అధికంగా దృష్టి సారించాము` అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రయాణం ఫిబ్రవరి 1999లో ప్రారంభమైంది. ఈ బ్యాంక్ అప్పట్లో తమ తొలి శాఖను విశాఖపట్నంలోని ద్వారకా నగర్లో ప్రారంభించింది. అప్పటి నుంచి, ఈ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్లో తమ కార్యకలాపాలను బ్యాంకు శాఖలు, డిజిటల్ బ్యాంకింగ్ కార్యక్రమాల ద్వారా విస్తరిస్తోంది.