Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : Sony India ఈరోజు Dolby Atmos అనుభవంతో - అత్యంత తేలికైన వైర్లెస్ ఇన్-ఇయర్ హెడ్‌ఫోన్ Sony WI-C100 ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఒక ప్రకటనలో వివరాలను తెలిపింది. కొత్తగా ప్రవేశపెట్టబడిన ఇన్-ఇయర్ హెడ్ఫోన్లు ఎటువంటి లోపంలేని, వైర్లెస్ వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి తయారు చేయబడ్డాయి. Sony దాని అభివృద్ధి ప్రక్రియ ప్రధాన భాగంలో చేర్చిన అంశాలు. తేలికగా ఉన్న మరియు కాంపాక్ట్ WI-C100 వైర్లెస్ హెడ్ఫోన్లు, అద్భుతమైన సౌండ్ కస్టమైజేషన్, ఉపయోగ సౌలభ్యం, సుదీర్ఘ బ్యాటరీ లైఫ్ మరియు స్ప్లాష్ ప్రూఫ్ డిజైన్‌తో అధిక నాణ్యత కలిగిన ధ్వనిని మిళితం చేస్తాయి. Sony యొక్క సరికొత్త వైర్లెస్ ఇన్-ఇయర్ హెడ్ఫోన్లు గొప్ప ఫీచర్లను అందిస్తాయి మరియు ప్రయాణంలో సంగీతాన్ని ఆస్వాదించాలని చూస్తున్న హై-ఫై సంగీత ప్రియులకు అనువైనవి.
1. WI-C100తో Dolby Atmos అనుభూతిని అనుభవించండి
BRAVIA XR TVకి కనెక్ట్ చేయబడిన Sony WLA-NS7 వైర్లెస్ ట్రాన్స్‌మిటర్‌తో, WI-C100 హెడ్ఫోన్లు మీ చుట్టూ ఉన్న ఫాంటమ్ స్పీకర్ల యొక్క అనుకూలమైన అమరికను సృష్టిస్తాయి కాబట్టి మీరు Dolby Atmos అనుభవాన్ని ఆస్వాదించవచ్చు. సన్నివేశంలో లీనమై ఉండండి మరియు యాక్షన్‌ను చక్కగా అనుభూతి చెందండి.
2. త్వరిత చార్జుతో కాల్స్ మరియు అంతరాయం లేని మ్యూజిక్ ప్లేబ్యాక్ కోసం 25 గంటల వరకుఎక్కువకాలం నడిచే బ్యాటరీ లైఫ్
హెడ్ఫోన్లు యూజర్లు 25 గంటల వరకు ఆగకుండా సంగీతాన్ని ఆస్వాదించడానికి వీలు కల్పిస్తాయి. WI-C100 ప్రయాణంలో వినడానికి అనుకూలమైనది. మీ హెడ్ఫోన్లలో ఛార్జ్ తక్కువగా ఉంటే, 10 నిమిషాల త్వరిత ఛార్జ్ మీకు 60 నిమిషాల వరకు అదనపు ప్లేటైమును అందిస్తుంది.
3. వర్క్ఔట్ కోసం IPX4 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో అపరిమితమైన మ్యూజిక్ ఆనందం
సరికొత్తWI-C100 IPX4 నీటి నిరోధకత రేటింగుతో వస్తుంది, కాబట్టి నీటి చిందులు మరియు చెమట WI-C100కి ఎటువంటి సమస్య కావు. మ్యూజిక్కు అనుగుణంగా లయ ఆనందిస్తూ మీ వర్క్ఔట్ కొనసాగించండి.
4. సాటిలేని సౌండ్ మరియు కాల్ నాణ్యత కోసం డిజిటల్ సౌండ్ ఎన్హాన్స్మెంట్ ఇంజన్ (DSEE)
హై క్వాలిటీ సౌండ్ అందించడానికి WI-C100 అనేది DSEE (డిజిటల్ సౌండ్ ఎన్హాన్స్మెంట్ ఇంజిన్)తో వస్తుంది. ఇది మీరు వింటున్న సంగీతానికి అధిక ఫ్రీక్వెన్సీ సౌండ్ మరియు ఫైన్ ఫేడ్-అవుట్ సౌండ్‌ని పునరుద్ధరించిమరింత ప్రామాణికమైన శ్రవణానుభవాన్ని సృష్టిస్తుంది.
5. WI-C100 హెడ్ఫోన్లలో 360 రియాలిటీ ఆడియోతో అత్యంత అద్భుతమైన అనుభవాన్ని ఆస్వాదించండి
WI-C100 360 రియాలిటీ ఆడియో మద్దతు శ్రోతలు ప్రత్యక్ష కచేరీ లేదా స్టూడియోలో ఆర్టిస్ట్ రికార్డింగ్‌లో ఉన్నట్లుగా పూర్తిగా లీనమయ్యే సౌండ్ అనుభూతిని అందిస్తుంది. 360 రియాలిటీ ఆడియోతో, సంగీతం మునుపెన్నడూ లేనంతగా అద్భుతమైనదిగా ఇంకా వాస్తవమైనదిగా ఉంటుంది.
6. హెడ్‌ఫోన్స్ కనెక్ట్ యాప్‌తో మీ హెడ్ఫోన్లను మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోండి
మీ వ్యక్తిగత ప్రాధాన్యతకు అనుగుణంగా మీ ధ్వనిని సిద్ధం చేసుకోండి, మీరు వింటున్న సంగీత శైలికి సరిపోయే విధంగా మీరు వివిధ రకాల ప్రీసెట్ల నుండి ఎంచుకోవచ్చు లేదా Sony యొక్క హెడ్‌ఫోన్స్ కనెక్ట్ యాప్‌లో ఈక్వలైజర్ లక్షణాన్ని ఉపయోగించి మీకు అనుకూలమైన స్వంత ప్రీసెట్లను సృష్టించి, సేవ్ చేసుకోవచ్చు.
7. ఫాస్ట్ పెయిర్‌తో సులభంగా మీ WI-C100 హెడ్ఫోన్లను కనుగొనండి
ఫాస్ట్ పెయిర్ మీ హెడ్ఫోన్లను మీ Android™ పరికరాలతో జత చేయడం సులభతరం చేస్తుంది. పాప్-అప్ గైడెన్స్ ని ఒక్కసారి తడితే, WI-C100 హెడ్ఫోన్లు మీ Android™ పరికరాలతో బ్లూటూత్ ® ని వేగంగా, అప్రయత్నంగా జత చేయడాన్ని ప్రారంభిస్తాయి. అలాగే, మీరు మీ హెడ్ఫోన్లను రింగ్ చేయడం ద్వారా లేదా మీ స్మార్ట్‌ఫోన్‌లో వాటి చివరి లొకేషన్ని పరిశీలించడం ద్వారా వాటిని ఎక్కడ పెట్టారో సులభంగా కనిపెట్టవచ్చు.
8. స్విఫ్ట్ పెయిర్ తో సులభంగా మీ PCకి WI-C100 హెడ్ఫోన్లను కనెక్ట్ చేయండి
స్విఫ్ట్ పెయిర్ అనేది Bluetooth® ద్వారా మీ Windows 11 మరియు Windows 10 కంప్యూటర్‌తో మీ WI-C100 హెడ్ఫోన్లను జత చేయడం వేగవంతం ఇంకా సులభం చేస్తుంది. జత చేసే మార్గాన్ని ఎంచుకున్నప్పుడు సమీపంలోని Windows 11 మరియు Windows 10 పరికరాలలో పాప్-అప్ పెయిరింగ్ గైడెన్స్ కనిపిస్తుంది.
9. సులభమైన ఆపరేషన్ బటన్లతో ఇబ్బంది లేని మరియు సునాయాసమైన శ్రవణానుభవాన్ని ఆనందించండి
ప్రతిరోజూ వినడాన్ని ఇబ్బంది లేకుండా చేయడానికి WI-C100 ప్రత్యేకంగా రూపొందించబడింది. సులభమైన ఆపరేషన్ బటన్లు ప్లే చేయడానికి, ఆపడానికి లేదా ట్రాక్స్ దాటవేయడానికి మరియు వాల్యూమ్ సర్దుబాటు చేయడానికి వీలు కల్పించడమే కాకుండా - అవి హ్యాండ్స్-ఫ్రీగా కాల్స్ చేయడానికి మరియు అందుకోవడానికి ప్రిఫర్ చేసే వాయిస్ అసిస్టెంట్- Google Assistant లేదా Siriని యాక్సెస్ చేయడానికి సులభమైన మార్గాన్ని కూడా అందిస్తాయి.
ధర మరియు లభ్యత:
WF-WI-C100 హెడ్ ఫోన్లు అన్నీ Sony రిటెయిల్ స్టోర్స్ (Sony Center మరియు Sony Exclusive), www.ShopatSC.com పోర్టల్, ప్రధాన ఎలెక్ట్రానిక్ స్టోర్స్ మరియు ఇతర ఇ-కామర్స్ వెబ్సైట్ అన్నింటిలోనూ 18 జూలై 2022 నుంచి అందుబాటులో ఉంటాయి.