Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశం ప్రధాన కార్యాలయంగా భారతదేశంలో అతిపెద్ద హోటల్ వ్యవస్థగా, గ్లోబల్ ట్రావెల్ టెక్నాలజీ కంపెనీ, ఓయో, 35కు పైగా దేశాలలో విస్తరించి ఉంది. దేశవ్యాప్తంగా సంస్థ యొక్క విస్తారమైన ఉనికిని బట్టి, దాదాపు ప్రతిచోటా ఓయో కనపడుతుంది.అయితే వాటిలో ఏది అత్యంత ప్రజాదరణ పొందిన ఓయోగా అగ్రస్థానంలో నిలుస్తుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు, తొలిసారిగా, హైదరాబాద్ మొత్తం మీద అత్యధికంగా బుక్ చేయబడిన ఓయోల వివరాలను ఈ సంస్థ ప్రకటించింది. ఓయో యొక్క సామాచార విశ్లేషణ ప్రకారం, ఢిల్లీ NCR మరియు బెంగళూరు తర్వాత భారతదేశంలో అత్యధికంగా బుక్ చేయబడిన మూడవ నగరంగా హైదరాబాద్ నిలిచింది. బుకింగ్ విశ్లేషణ ప్రకారం, ఓయో9405 హోటల్ స్టే హోమ్ మరియు సిల్వర్ కీ ఎగ్జిక్యూటివ్ స్టే 28060, గచ్చిబౌలి, హైదరాబాద్‌లో అత్యధికంగా బుక్ చేయబడిన ఓయోలుగా నిలిచాయి.భారతదేశం అంతటా అత్యధికంగా బుక్ చేయబడిన టాప్ 10 ఓయోల జాబితాలో ఈ ప్రాపర్టీలు వరుసగా 7వ మరియు 8వ స్థానంలో ఉన్నాయి. ఈ రెండు ఓయోలు బహుళ సాంకేతిక మరియు IT కంపెనీలకు ప్రసిద్ధి చెందిన హైదరాబాద్‌లోని IT హబ్ గచ్చిబౌలిలో ఉన్నాయి. అలాగే, ఇవి హైటెక్ సిటీ నుండి సుమారు 5 కి.మీ దూరంలో ఉన్నాయి.
దాదాపు 20 హోటళ్లతో, టాప్ 50 జాబితాలోని ఓయోలలో ఎక్కువ భాగం ముఖ్యమైన ట్రాన్సిట్ హబ్‌లు మరియు కీలకమైన కార్పొరేట్ కాంప్లెక్స్‌లకు సమీపంలో ఉన్నాయి. ప్రయాణం చేయడానికి అనువుగా ఉంటూ వాణిజ్య కేంద్రాల సమీపంలో ఉన్న ఓయోలకు వినియోగదారుల నుంచి అధిక డిమాండ్ లభించడాన్ని గమనించవచ్చు. దీని తరువాత విహారయాత్రల కోసం పర్యాటకులు బుక్ చేసుకునే ప్రకృతితో చుట్టుముట్టబడి మరియు పచ్చని దృశ్యాలు ఉన్న హోటళ్లకు అధిక డిమాండ్ ఉంది. కీలకమైన రవాణా కేంద్రాల చుట్టూ ఓయోలకు గల అధిక డిమాండ్‌కి, ఎయిర్ కండిషనింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, వేగవంతమైన నెట్ కనెక్టివిటీ వంటి ముఖ్యమైన సౌకర్యాలను కలిగి సరసమైన, పరిశుభ్రమైన బసలను అందించడానికి సంస్థ చేస్తున్న కృషిని కారణంగా చెప్పవచ్చు.