Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 50 వేల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు
హైదరాబాద్:ఎలక్ట్రిక్ వాహనా లకు చార్జింగ్ వసతులు కల్పించే చార్జ్‌నెట్ తాజాగా ఇవి సొల్యూషన్స్ కంపెనీ బైక్‌వోతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ద్విచక్ర, త్రిచక్ర, ఫోర్ వీలర్ల కోసం 50,000లకు పైగా చార్జింగ్, స్వాపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. బైక్‌వో డీలర్/డిస్ట్రిబ్యూటర్ నెట్‌వర్క్‌తో ఛార్జింగ్ సెంటర్లను అన్ని నగరాలకు విస్తరించడానికి ఈ భాగస్వామ్యం సహాయపడుతుందని చార్జ్‌నెట్ కో-ఫౌండర్ చక్రవర్తి అంబటి తెలిపారు. 'నెట్వర్క్ విస్తరణకు రూ.70 కోట్లు పెట్టుబడుల వ్యయం చేయనున్నాం. దేశంలోనే అతిపెద్ద చార్జింగ్ నెట్వర్క్ ఏర్పాటు చేయ డానికి బైకోవోతో భాగస్వామ్యం దోహదం చేయనుంది. హైదరాబాద్ లోని కంపెనీ ప్లాంటుకు నెలకు 20,000 యూనిట్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. దీనిని 18 నెలల్లో రెండింతలకు పెంచుతాం. ఇప్పట ికే హైదరాబాద్, చెన్నరు, బెంగళూరులో 200లకుపైగా చార్జింగ్ స్టేష న్స్ అందుబాటులోకి తెచ్చాం' అని చక్రవరి తెలిపారు. ద్విచక్ర వాహ నాల విక్రయాలు, సర్వీస్, బీమా, రుణ సౌకర్యం, యాక్సెసరీస్, చార్జింగ్ మౌలిక వసతులను కల్పిస్తూ వన్‌స్టాప్ షాప్ సొల్యూషన్స్ అందిస్తున్నట్టు బైక్‌వో కో-ఫౌండర్ విద్యాసాగర్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ నాటికి మొత్తం 140 స్టోర్ల స్థాయికి చేరుకోవాలన్నది లక్ష్యమన్నారు.