Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఆటోమోటివ్ రిటెయిల్ క్లౌడ్® (ARC) ఆవిష్కర్త, మొదటి మరియు వేగవంతమైన క్లౌడ్-నేటివ్ ఆటోమోటివ్ రిటైల్ సాస్ (SaaS) ప్లాట్‌ఫారమ్ టెకియాన్, 2022 ఏడాది కోసం భారతదేశంలో క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది. రానున్న రెండు నెలల్లో, టెకియాన్ టాలెంట్ అక్విజిషన్ బృందాలు భారతదేశంలోని అనేక ఇంజినీరింగ్ కళాశాలలను సందర్శించి 400 మంది ఇంజనీర్లను రిక్రూట్ చేసుకోనుండగా, వీరు సంస్థకు చెందిన గ్లోబల్ ఇన్నోవేషన్ జట్టులో భాగం అవుతారు.
ప్లెసాంటన్ (కాలిఫోర్నియా)లో ప్రధాన కార్యాలయం కలిగిన టెకియాన్, భారతదేశం, యూఎస్ఏ, కెనడా, ఫ్రాన్స్ మరియు జర్మనీ వ్యాప్తంగా 2,000+ ఇన్నోవేటర్లతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. టెస్లా మాజీ సీఐఓ, టెక్ ఇన్నోవేటర్ జే విజయన్ 2016లో దీన్ని నెలకొల్పగా, భారతదేశంలో బెంగళూరు (APAC ప్రధాన కార్యాలయం) మరియు చెన్నై (ప్రాంతీయ కేంద్రం)లో టెకియాన్కు కార్యాలయాలు ఉన్నాయి.
భవిష్యత్తు అవసరాలకు, వినియోగదారునికి అసమానమైన అనుభవాన్ని అందించేందుకు ఆటోమోటివ్ రిటైల్ పరిశ్రమను మార్చే ఏకైక క్లౌడ్-నేటివ్ ప్లాట్‌ఫారమ్‌ను టికియాన్ నిర్మిస్తోంది. టెకియాన్ ప్లాట్‌ఫారమ్ ఇప్పటికే పరిశ్రమ నుంచి నమ్మశక్యం కాని ఆమోదాన్ని అందుకుంది- ప్రపంచంలోని అతిపెద్ద ఆటోమోటివ్ రిటైలర్ టెకియాన్లో తన వ్యాపారాన్ని నడుపుతోంది మరియు ఉత్తర అమెరికాలో అతిపెద్ద ఆటోమోటివ్ తయారీదారు టెకియాన్ తన ప్లాట్‌ఫారమ్‌లో ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తోంది.
‘అభిరుచి, ఎంటర్‌ప్యూనర్‌షిప్ స్ఫూర్తి, పరిశ్రమలో సుదీర్ఘ నైపుణ్యం, ప్రత్యేకమైనదాన్ని సృష్టించేందుకు మేము తాజా సాంకేతికతలను ఉపయోగిస్తాము. మేము అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన మరియు బిగ్ డేటా, మెషిన్ లెర్నింగ్ (ML)/ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఐఓటీల సహకారంతో వేగవంతమైన, సమీకృత, సొగసైన మరియు సహజమైన ప్లాట్‌ఫారమ్‌ను సృష్టిస్తున్నాము. అడ్డంకులను అధిగమించేందుకు మరియు పెద్ద సమస్యలను పరిష్కరించేందుకు అన్నింటినీ అనుసంధానం చేస్తూనే, మా మార్గంలో కొత్త సాంకేతికతను ఆవిష్కరిస్తున్నాము’’ అని టెకియాన్ సీఈఓ & వ్యవస్థాపకుడు జే విజయన్ తెలిపారు.
టెకియాన్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా బ్యాక్ఎండ్ ఇంజనీర్లు, ఫ్రంట్‌ఎండ్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, క్వాలిటీ అనలిస్టులు, పెర్ఫార్మెన్స్ ఇంజనీర్లు, డేటా అనలిస్టులు మరియు అప్లికేషన్ సపోర్ట్ ఇంజనీర్లు వంటి ఫ్రెషర్లను నియమించుకోనుంది. టేకియోన్ బృందాలు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పంజాబ్, ఒడిశా, రాజస్థాన్ తదితర రాష్ట్రాలు, జంషెడ్పూర్, గౌహతి, మండి, రూర్కీ, నోయిడా, లక్నో మరియు రాయ్‌పూర్ తదితర నగరాలను సందర్శించనున్నారు.
“మేము జావా మరియు React.js వంటి నైపుణ్యాలు కలిగిన టెక్ టాలెంట్ల కోసం చూస్తున్నాము. మా క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ క్రమబద్ధమైనది మరియు ప్రక్రియ-ఆధారంగా ఉంటుంది. ఇది ఆన్లైన్ కోడింగ్ అసెస్మెంట్తో ప్రారంభమై రెండు రౌండ్ల సాంకేతిక ఇంటర్వ్యూలు, హెచ్ఆర్ చర్చతో ముగుస్తుంది. పరిష్కరణ, ప్రయోజనాలు మరియు ఉదారమైన ఇఎస్ఓపీలను మేము అందిస్తుండగా, ఇవి టెక్ పరిశ్రమలో ఫ్రెషర్ల కోసం అత్యుత్తమ ప్యాకేజీలలో ఒకటిగా ఉన్నాయి’’ అని టెకియాన్లో ఇంజినీరింగ్, ప్లాట్‌ఫారమ్ & ఆర్కిటెక్చర్ విభాగం ఉపాధ్యక్ష్యుడు వేద్ సుర్తాని అన్నారు.
కంపెనీ .5 బిలియన్ల విలువ కలిగి ఉండగా, బలమైన ఇఎస్ఓపీల ప్రోగ్రామ్ ద్వారా ఉద్యోగుల మధ్య సంపద సృష్టి మరియు పంపిణీకి సంబంధించిన ఫిలాసఫీపై ఉత్తమమైన నమ్మకాన్ని కలిగి ఉంది. సంస్థ గత 2 ఏళ్లలో రెండుసార్లు ఉద్యోగుల స్టాక్ లిక్విడేషన్ను సరళీకృతం చేసింది. టెకియాన్ ఇటీవలే బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్‌లోని బాగ్మనే సోలారియం సిటీలో కొత్త కార్యాలయంలోకి (110,000 చ.అడుగుల కార్యాలయ స్థలం) మారింది. చెన్నైలో, పల్లావరంలోని ఎంబసీ స్ల్పెండిడ్ టెక్ జోన్లో టెకియోన్ దాదాపు 53,000 చ.అడుగుల కార్యాలయ స్థలాన్ని లీజుకు తీసుకుంది. బెంగుళూరు మరియు చెన్నై గ్లోబల్ టీమ్‌ల సహకారంతో ఉత్పత్తి అభివృద్ధికి గణనీయంగా దోహదపడుతున్నాయి.
“మా కొత్త కార్యాలయాలు అత్యాధునికమైనవి మరియు ఓపెన్ కొలాబరేషన్ స్పేస్‌లు, వ్యాయామశాల, సహజమైన పచ్చదనం, కెఫటేరియా, యోగా గది, గేమింగ్ జోన్ మరియు అనేక వినోదాత్మక అంశాలతో సహా స్ఫూర్తిదాయకమైన థీమ్‌లతో ఆదర్శవంతమైన పని వాతావరణాన్ని అందిస్తాయి. టెకియాన్లో మేము అవకాశాలను అధిగమించేందుకు ఒక జట్టుగా పని చేస్తాము. మా గ్లోబల్ కోలాబరేటివ్ వర్కింగ్ మోడల్లో బెంగళూరు మరియు చెన్నై అంతర్భాగాలు. కెరీర్ పురోగతి వేగంగా ఉంది మరియు ఉద్యోగులు సిలికాన్ వ్యాలీలో అత్యంత ప్రబలమైన మరియు విజయవంతమైన కంపెనీల నుంచి కొన్ని ప్రకాశవంతమైన మనస్సులతో పని చేస్తున్నారు” అని టెకియోన్ పీపుల్ టీమ్ ఎస్విపి రానా రాబిల్లార్డ్ వివరించారు.
టెకియాన్ గురించి
సుదీర్ఘమైన డీలర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్లాట్‌ఫారాలపై 50-ఏళ్లుగా ఆధారపడటాన్ని అధిగమించేలా చేసే టెకియాన్ మొదటి మరియు వేగవంతమైన క్లౌడ్-నేటివ్ ఆటోమోటివ్ రిటైల్ ప్లాట్‌ఫారమ్ కాగా, ఇది ఆటోమోటివ్ రిటైల్ క్లౌడ్ (ARC)తో పాత మోడల్‌ను సవాలు చేస్తోంది. మార్పుతో కూడిన ఈ డీలర్షిప్ సాఫ్ట్వేర్ ప్లాట్‌ఫారమ్ అత్యాధునిక సాంకేతికత, పెద్ద డేటా, మెషిన్ లెర్నింగ్ మరియు కృత్రిమ మేధస్సును ఉపయోగించి ఓఈఎంలు, రిటైలర్లు/డీలర్లు మరియు వినియోగదారులను సజావుగా ఒకచోటకు చేర్చుతుంది. అత్యంత కాన్ఫిగర్ చేయదగిన ఇంటిగ్రేషన్ మరియు ఎక్కువ వినియోగదారులను అనుసంధానం చేసే సామర్థ్యాలతో, ఏఆర్సి డీలర్/వినియోగదారుల సంబంధాన్ని, ప్రయాణాన్ని సులభతరం చేస్తోంది. సిలికాన్ వ్యాలీలో నెలకొల్పబడిన టెకియాన్ ప్రపంచవ్యాప్తంగా 1,500 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉంది.