Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఇండియన్ గ్యాస్ ఎక్సేంజ్ (ఐజీఎక్స్) 22,64,100 ఎంఎంబీటీయు గ్యాస్‌ను పరిమాణంను (57 ఎంఎంఎస్‌సీఎం) వాణిజ్యం చేయడంతో పాటుగా జూలై 2022లో అత్యధికంగా 468% ఇయర్ ఆన్ ఇయర్ వృద్ధిని నమోదు చేసింది. జూలై 2021లో 3,98,550 ఎంఎంబీటీయు వాణిజ్యం నమోదు చేసింది.
ఈ నెలలో, ఈ ఎక్సేంజ్ 16,38,300 ఎంఎంబీటీయు (41.3 ఎంఎంఎస్‌సీఎం) వాల్యూమ్స్‌ను డెలివరీ చేసింది. అంతేకాకుండా 130 ట్రేడ్స్ ఈ నెలలో ఎక్సేంజ్ వద్ద జరిగాయి. ఒక నెలలో జరిగిన అత్యధిక ట్రేడ్స్ సంఖ్య ఇది.
ఈ ఎక్సేంజ్ వద్ద జూలై నెలలో కనుగొనబడిన సరాసరి ధర 1690 రూపాయలు/21.4 డాలర్లుగా ఒక్క ఎంఎంబీటీయుకు ఉంది. అదే సమయంలో సరాసరి అంతర్జాతీయ స్పాట్ గ్యాస్ ధర దాదాపుగా ఒక ఎంఎంబీటీయుకు 40 డాలర్లుగా ఉంది. ఈ ధర హెన్రీ హబ్ వద్ద దాదాపుగా 7.2 డాలర్లు/ఎంఎంబీటీయుగా నమోదయింది. ఇండియన్ గ్యాస్ ఎక్సేంజ్‌పై కనుగొనబడిన ధరలు భారతదేశపు డిమాండ్ మరియు ఎల్ఎన్జీ దీర్ఘకాలిక, స్పాట్ మరియు దేశీయ గ్యాస్ ధరల సహా సహజవాయువు సరఫరాను ప్రతిబింబిస్తుంది.
ఈ నెలలో ఐజీఎక్స్ ఒక రోజులో అత్యధికంగా దేశీయ సీలింగ్ ధర గ్యాస్ ఉ 3,85,500 ఎంఎంబీటీయును 792/ఎంఎంబీటీయు (9.92 డాలర్లు/ఎంఎంబీటీయు)వద్ద ట్రేడింగ్ చేసి రికార్డు సృష్టించింది. దీనిలో సీజీడీలు, పెట్రోకెమికల్, పవర్, గ్లాస్, సెరామిక్స్, స్టీల్, మార్కెటర్స్ మొదలైన రంగాలూ ఉన్నాయి. దీనిలో 59 మంది కొనుగోలుదారులు కూడా ఉన్నారు.
ఈ నెలలో కనిపించిన మరో ప్రత్యేక ఆకర్షణ ఏమిటంటే పీపీఏసీ ఇప్పుడు ఐజీఎక్స్ ధరలను పీపీఏసీ నెలవారీ అడ్రిడ్జ్డ్ రెడ్ రెక్నార్ నివేదిక ప్రచురించడం ప్రారంభించింది.
జూలై 2022 నెలలో గ్యాస్ మార్కెట్లో కనిపించిన ప్రధాన ఆకర్షణలు ఈ దిగువ రీతిలో ఉన్నాయి :
మొత్తం వాణిజ్య పరిమాణం : 22,64,100 ఎంఎంబీటీయు
మొత్తం డెలివరీ చేసిన వాల్యూమ్ : 16,38,300 ఎంఎంబీటీయు
మొత్తం ట్రేడ్స్ సంఖ్య ఈ నెలలోః 130
రికార్డు డొమెస్టిక్ సీలింగ్ ప్రైస్ గ్యాస్ వాణిజ్యం : 3,85,500 ఎంఎంబీటీయు
ఐజీఎక్స్ ప్రస్తుతం ఆరు (6) విభిన్నమైన కాంట్రాక్ట్‌లు అయినటువంటి డే ఉఎహెడ్, డెయిలీ, వీక్ డే, వీక్లీ, పక్షం, నెల ఉలో డెలివరీ బేస్ ట్రేడ్ నిర్వహిస్తోంది. వరుసగా ఆరు (6) నెలలు దీనిని చేసింది. గ్యాస్ వాణిజ్యం పలు డెలివరీ పాయింట్స్ అయినటువంటి ఉ దహేజ్, హజీరా, అంకోట్, మస్కల్, బాద్భుట్, దబోల్, కెజీ బేసిన్ ద్వారా ఐజీఎక్స్ వాణిజ్యం నిర్వహిస్తుస్తూ ఆరు (6) ప్రాంతీయ గ్యాస్ హబ్స్ అయినటువంటి వెస్ట్రన్ హబ్, సదరన్ హబ్, ఈస్ట్రన్ హబ్, సెంట్రల్ హబ్, నార్త్రన్ హబ్, ఈశాన్య హబ్ ద్వారా దేశమంతా కవర్ చేస్తుంది.