Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఇండియా యమహా మోటార్ (ఐవైఎం) కొత్తగా మోన్స్టార్ ఎనర్జీ యమహా 2022 మోటోజిపి ఎడిషన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇందులో నాలుగు ద్విచక్ర వాహన మోడళ్లను ఆవిష్కరించింది. వైజడ్ఎఫ్-ఆర్15ఎం, ఎంటి-15వి2.0 మోటర్ సైకిళ్లు సహా ఆరెక్స్ 155, రేజడ్ఆర్125 ఎఫ్ఐ స్కూటర్లు ఉన్నాయి. ఈ వాహనాలు తమ అన్ని బ్లూస్కేర్ అవుట్లెట్లలో లభిస్తాయని వెల్లడించింది. ఎక్స్‌షోరూం వద్ద ఆర్15ఎం ధర రూ.1,90,900గా, ఎంటి15వి2.0 ధర రూ.1,65,400గా, రే జడ్ఆర్ 125 ఫై ధర రూ.87,300గా నిర్ణయించగా.. ఆరెక్స్ 155 ధరను ప్రకటించలేదు.