Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరోసారి వడ్డీ రేట్ల పెంపు..!
ముంబయి : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశాలు బుధవారం ప్రారంభం అయ్యాయి. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన మూడు రోజుల పాటు సాగనున్న ఈ భేటీ ఆగస్టు 5న ముగియనుంది. ఇప్పటికే వరుసగా రెండు సార్లు కీలక వడ్డీ రేట్లను పెంచింది. మరోసారి దఫా కూడా పెంచనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలో అమాంతం పెరిగిన ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి దాదాపు 35-50 బేసిస్ పాయింట్లు పెంచొచ్చని భావిస్తున్నారు. గత రెండు మానిటరీ పాలసీ సమావేశాల్లో 90 బేసిస్ పాయింట్లు పెంచిన సంగతి తెలిసిందే