Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ కార్ల తయారీదారు కియా ఇండియా తన సెల్టోస్ ఎస్‌యువిలోని అన్ని వేరియంట్లను ఇక ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో అందిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో తమ ఖాతాదారులకు మరింత భద్రత కల్పించనున్నట్లు పేర్కొంది. అక్టోబర్ 2022 నుంచి అన్ని కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేస్తూ కేంద్ర రోడ్డు భద్రతా మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో సెల్టోస్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను ఏర్పాటు చేసింది. కాగా.. దీంతో బేసిక్ మోడల్‌పై మరో రూ.30వేలు ధర పెరుగొచ్చని తెలుస్తోంది.