Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశానికి చెందిన ప్రముఖ విమానయాన సంస్థ అయిన ఇండిగో, ఈరోజు ఒక కొత్త విప్లవాత్మక త్రీ పాయింట్ డిసెంబార్కేషన్ ప్రక్రియను ప్రవేశపెట్టింది. ఈ ప్రక్రియ తన కస్టమర్లు మునుపెన్నడూ లేనంత వేగంగా విమానం నుండి నిష్క్రమించడానికి వీలు కల్పిస్తుంది. కొత్త త్రీ పాయింట్ డిసెంబార్కేషన్ ప్రక్రియ రెండు ముందరి మరియు ఒక వెనక ఎగ్జిట్ రాంప్ ద్వారా నిర్వహించబడుతుంది మరియు ప్రపంచంలోనే మొదటిసారిగా ఈ ప్రక్రియను ఉపయోగించిన ఎయిర్‌లైన్‌గా ఇండిగో నిలిచింది.
ఈ ఉన్నతమైన త్రీ పాయింట్ డిసెంబార్కేషన్ ప్రక్రియ, ఇండిగో తన 16వ వార్షికోత్సవం సందర్భంగా వినియోగదారుల అనుభవంలో కొత్త ప్రమాణాలను నిర్దేశించడంలో సహాయపడుతుంది.
ఇండిగో యొక్క 16వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, CEO మరియు పూర్తి స్థాయి డైరెక్టర్ అయిన రోనోజోయ్ దత్తా మాట్లాడుతూ, “ప్రపంచంలోనే మొదటిసారిగా ఒక త్రీ-పాయింట్ సిస్టమ్‌ని ఉపయోగించిన ఎయిర్‌లైన్‌గా నిలవడం మాకు గర్వకారణం. ఇండిగోలో, మేము నిరంతరంగా మరియు క్రియాశీలకంగా మా అంతర్గత ప్రమాణాలను తిరిగి ఆవిష్కరిస్తూ, కస్టమర్లకు ఎటువంటి ఇబ్బంది లేని అనుభవాన్ని కలిగిస్తూనే విమానాశ్రయ ఆపరేటర్లు మరియు ఇతర సిబ్బంది యొక్క కార్యాచరణ సామర్థ్యాలకు సహకరిస్తాము” అని అన్నారు.
ఈ చారిత్రాత్మక సందర్భంగా ఇండిగో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ రాందాస్ మాట్లాడుతూ, “ఇండిగోలో కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి, విమానయాన్ని సులభతరం చేయడానికి మరియు మా గ్రౌండ్ కార్యకలాపాలను సమర్థవంతంగా మరియు ఎలాంటి అవాంతరాలు లేకుండా చేయడానికి మేము ఎల్లప్పుడూ కొత్త మార్గాలను పరిశీలిస్తాము. ప్రయాణికులు దిగడం కోసం మూడవ ర్యాంప్‌ని జోడించడం అనేది మా కస్టమర్లకు సున్నితమైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి ఒక సులభమైన మరియు ప్రభావవంతమైన మార్గం. వినూత్న ప్రయాణంలో కొత్త బెంచ్‌మార్క్‌లను నిర్దేశించడానికి మేము ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటాము మరియు మా కస్టమర్లకు ప్రయాణ అనుభవాన్ని మరియు మధురంగా మార్చడానికి మా 16వ వార్షికోత్సవం సరైన సందర్భం - దీని వల్ల వారు త్వరగా తాము పని చేసే ప్రదేశానికి త్వరగా చేరుకోవచ్చు లేదా వారి ప్రియమైన వారిని వెంటనే కలుసుకోవచ్చు” అని అన్నారు.
ఇండిగో ఈ ప్రక్రియపై పరీక్షించినపుడు కస్టమర్ల నుండి ప్రోత్సాహకరమైన అభిప్రాయాన్ని పొందింది. డిబోర్డింగ్ సమయంలో కస్టమర్లకు తెలియజేయడానికి క్యాబిన్ సిబ్బంది అవసరమైన ప్రకటనలు చేస్తారు. ఈ కొత్త డిసెంబార్కేషన్ విధానం ఢిల్లీ, ముంబై మరియు బెంగళూరు విమానాశ్రయాల్లోని రిమోట్ స్టాండ్ల వద్దకు వచ్చే విమానాల కోసం ఇండిగో యొక్క A320 మరియు A321 ఫ్లీట్‌లో ప్రారంభించబడుతుంది మరియు క్రమంగా మిగిలిన నెట్వర్క్ అంతటా అమలు చేయబడుతుంది.