Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దుకాణాలలో నమ్మకమైన, సౌకర్యవంతమైన పేమెంట్ ట్రాకింగ్ కోసం స్మార్ట్ స్పీకర్ ను ఆవిష్కరించామని భారతదేశపు అగ్రగామి ఫిన్ టెక్ సంస్థ PhonePe ప్రకటించింది. ప్రస్తుతం ఈ స్మార్ట్ స్పీకర్ 8 నగరాల్లో ఆవిష్కరించబడగా, ఇప్పటికే లక్షకు పైగా సాధనాలను PhonePe మర్చంట్ భాగస్వాములు ఉపయోగిస్తున్నారు. PhonePe స్మార్ట్ స్పీకర్ 11 భారతీయ భాషల్లో పేమెంట్ నోటిఫికేషన్లను అందిస్తుంది. బ్యాటరీ లైఫ్ 4 రోజుల వరకు ఉంటుంది. 50 రూపాయల ప్రారంభ సెటప్ ఖర్చుతో, నెలకు 50 రూపాయల అద్దెతో షాపు వద్దే నేరుగా ఇన్ స్టాల్ చేయబడుతుంది. ప్రారంభ ఆఫర్ కింద నెలకు 25కు పైగా లావాదేవీలను జరిపిన మర్చంట్లకు ప్రారంభ సెటప్, నెలవారీ అద్దె 1 రూపాయికే లభిస్తుంది. తయారీ లోపాలు ఏమైనా ఉంటే, జీవిత కాలం పాటు ఉచిత మార్పిడీ అవకాశం కూడా ఉంది.
ఈ సందర్భంగా PhonePeలోని ఆఫ్ లైన్ బిజినెస్ విభాగం హెడ్ వివేక్ లోచబ్ మాట్లాడుతూ, ’’మా మర్చంట్లు వ్యాపారాన్ని సులభంగా నడుపుతూ, అభివృద్ధి చేసుకునేందుకు వీలుగా PhonePeలో మేము కొత్త కొత్త ఆఫరింగ్ లను నిరంతరం నిర్మిస్తున్నాము. స్మార్ట్ స్పీకర్ ను ఆవిష్కరించి, భారతదేశం నలుమూలల్లోనూ ప్రవేశపెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. భారతదేశంలోని ప్రతి మర్చంట్ కు స్మార్ట్ స్పీకర్ అందుబాటులో ఉండాలన్నది మా లక్ష్యం అయినందున సెటప్, ఇన్ స్టలేషన్ ఖర్చులను చాలా వరకు తక్కువ చేశాము’’ అని అన్నారు.
2015 డిసెంబర్ నెలలో స్థాపించబడిన PhonePe భారతదేశపు అతిపెద్ద పేమెంట్ల యాప్ గా అవతరించింది. వినియోగదారులు, వ్యాపారులు లాంటి వారిని డిజిటల్ మార్గంలో మేళవించే వీలు కల్పించింది. 390 మిలియన్లకు పైగా రిజిస్టర్డ్ వినియోగదారులను కలిగిన PhonePeను ప్రస్తుతం ప్రతి నలుగురు భారతీయులలో ఒకరు ఉపయోగిస్తున్నారు. అంతేకాక, దేశంలోని 99శాతం పిన్ కోడ్లను కవర్ చేస్తూ, ద్వితీయ, తృతీయ, నాలుగో శ్రేణి, అంతకన్నా చిన్న పట్టణాలలోని 30 మిలియన్లకు పైగా ఆఫ్ లైన్ మర్చంట్లను కూడా ఈ సంస్థ డిజిటల్ మయం చేసింది. 2017లో ఆర్థిక సేవల రంగంలోకి అడుగు పెట్టిన PhonePe 24 క్యారెట్ల బంగారాన్ని కొనేందుకు సురక్షితమైన, సులభమైన మార్గాన్ని అందిస్తోంది. తన వేదికలో ఇటీవల వెండి కొనుగోలును కూడా ఆవిష్కరించింది. అప్పటినుండి, పన్ను ఆదా ఫండ్లు, లిక్విడ్ ఫండ్లు, అంతర్జాతీయ ప్రయాణ బీమా, జీవిత బీమా, కొవిడ్-19 బీమా లాంటి అనేకమైన మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ ఉత్పత్తులను PhonePe ప్రవేశపెట్టింది. PhonePeను ఉపయోగించి, వినియోగదారులు డబ్బు పంపడం, అందుకోవడం, మొబైల్, DTH రీఛార్జ్ చేయడం, దుకాణాలలో పే చేయడం, తమ వినియోగ పేమెంట్లు అన్నిటినీ చేయడం లాంటివి కూడా చేయవచ్చు. ట్రస్ట్ రిసెర్చ్ అడ్వైజరీ (TRA) ఇటీవల విడుదల చేసిన బ్రాండ్ ట్రస్ట్ రిపోర్ట్ 2022 ప్రకారం డిజిటల్ పేమెంట్ల విషయంలో అత్యంత నమ్మకమైన బ్రాండ్ అనే గుర్తింపును PhonePe దక్కించుకుంది.