Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్యూ1లో రూ.224 కోట్ల లాభాలు
హైదరాబాద్ : ప్రభుత్వ రంగంలోని యూకో బ్యాంక్ ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో 21 శాతం వృద్థితో రూ.123.61 కోట్ల లాభాలు నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.102 కోట్ల లాభాలు ఆర్జించింది. ఇదే సమయంలో రూ.1,460.23 కోట్లుగా ఉన్న బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ).. గడిచిన క్యూ1లో రూ.1,649.54 కోట్లకు చేరింది. 2022 జూన్ త్రైమాసికంలో మొండి బాకీలకు కేటాయింపులు ఏకంగా 75.66 శాతం తగ్గి రూ.246.83 కోట్లకు పరిమితమయ్యాయి. ఈ పరిణామం బ్యాంక్ మెరుగైన ఫలితాలకు ప్రధాన కారణం. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.1,014 కోట్ల కేటాయింపులు చేసింది. ఇదే సమయంలో 3.85 శాతంగా బ్యాంక్ నికర నిరర్థక ఆస్తులు.. క్రితం క్యూ1లో 2.49 శాతానికి తగ్గాయి.