Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ ప్రైమ్ డేకు భారతదేశంలోని ఎగుమతిదారులకు యు.ఎస్., యూకే మరియు ఆస్ట్రేలియా వ్యాపార ప్రగతిని ఉత్తేజిస్తుండగా, కొత్తగా జపాన్ అధిక-వృద్ధికి గమ్యస్థానంగా మారడంతో పాటు 3 రెట్లు ఎక్కువ వ్యాపార వృద్ధిని చూసింది. ఈ ఏడాది జులై 12-13వ తేదీల్లో ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన ప్రైమ్ డే కార్యక్రమంలో అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ సగటు 50% మేర వ్యాపార వృద్ధిని సాధించగా, లక్షలాది మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్తంగా విక్రయమయ్యాయి. ఇటీవలి కాలంలో భారతదేశంలోని వ్యాపారులు ఎదుర్కొన్న ఆర్థిక ఒడిదుడుకుల అనంతరం ఈ షాపింగ్ కార్యక్రమం పలువురు ఎగుమతిదారులను ప్రపంచ స్థాయికి తీసుకు వెళ్లేందుకు భారీ అవకాశాలను కల్పించింది మరియు ప్రపంచ వ్యాప్తంగా భారతీయ ఇ-కామర్స్‌కు ఉత్తేజాన్ని అందించింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ పొందిన భారతీయ బ్రాండ్లయిన వహ్దం టీస్, డి’మోక్ష హోమ్స్, ఐటిసి, కాలిఫోర్నియా డిజైన్ డెన్, స్లర్ప్ ఫార్మ్, ఇమేజిమేక్ టాయ్స్ మరియు సన్‌ఫ్లవర్ తదితరరాలు ప్రైమ్ డే 2022లో పాల్గొన్నాయి.
‘‘గ్లోబల్ అమెజాన్ డే 2022 మాకు మహోన్నతమైన అనుభవం కాగా, సాధారణ రోజులతో పోల్చితే మా వ్యాపారంలో 5 రెట్లు వృద్ధి చూశాము’’ అని ప్రత్యేకమైన తైలాలు, డిఫ్యూజర్‌లను విక్రయించే గురునందా వ్యవస్థాపకుడు పునీత్ నందా తెలిపారు. గ్లోబల్ ఎడ్యుకేషన్ బ్రాండ్ సిల్క్మ్యాటిక్స్ ధవనీల్ సేఠ్ కూడా అదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘‘ప్రైమ్ డే 2022 మాకు అపారమైన విజయాన్ని అందించింది. మేము గత ఏడాది 4 రెట్లు ఎక్కువ వృద్ధి చెందాము; మేము నిర్దేశించుకున్న ప్రణాళిక సంఖ్యను అధిగమించాము మరియు బ్రాండ్‌కు వినియోగదారుల నుంచి దక్కిన దృఢమైన అభిమానం మమ్మల్ని ఆశ్చర్యచకితులను చేసింది’’ అని ఆయన పేర్కొన్నారు.
‘‘ప్రైమ్ డే సంప్రదాయకంగా ప్రైమ్ సభ్యులకు వేడుకగా నిలిచింది. ఈ ఏడాది అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ ప్రపంచ వ్యాప్తంగా భారతీయ ఎగుమతిదారులకు మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను లక్షలాది మంది వినియోగదారులకు చేర్చేందుకు సాధ్యపడడం మాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగదారులు ఇ-కామర్స్‌పై విశ్వాసాన్ని పెంచుకుంటూ ఉండడంతో మేము అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ అన్ని పరిమాణాల్లోని విక్రేతలకు ఎగుమతులను వృద్ధి చేసుకునేందుకు మద్ధతు ఇస్తున్నాము’’ అని అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ ఇండియా డైరెక్టర్ భూపేన్ వకంకర్ తెలిపారు.
భారతదేశపు ఉత్పత్తులకు ఎక్కువ డిమాండ్
ఉత్తర అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల్లోని అమెజాన్ వినియోగదారులు అన్ని విభాగాల్లో విస్తృత శ్రేణి ఉత్పత్తులను కొనుగోలు చేసుకున్నారు. అత్యంత ఎక్కువ ప్రగతి కిచెక్ ఉత్పత్తులు, స్టెమ్ బొమ్మలు, దుస్తులు, పాదరక్షలు, కార్యాలయ ఉత్పత్తులు, బ్యూటీ మరియు ఆరోగ్య సేవల ఉత్పత్తులు ఉన్నాయి. యు.ఎస్., యు.కె., మరియు ఆస్ట్రేలియా ఈ ప్రైమ్ డేకు వ్యాపార ప్రగతి ఉత్తేజనాన్ని కొనసాగించగా, విక్రేతలకు కొత్తగా జపాన్ ఎక్కువ ప్రగతి గమ్యస్థానంగా నిలువగా, అక్కడ విక్రయాల వృద్ధి ఈ ఏడాది 3 రెట్లు ఎక్కువైంది.
‘‘మా ఉత్పత్తుల్లో – విలాసవంతమైన బెడ్ షీట్లు యు.ఎస్.లో అత్యంత సూక్తమైన ఇ-కామర్స్ ఉత్పత్తిగా ఉంది. మా ఉత్పత్తులు అమెజాన్.కాంలో విడుదల చేసి 5 ఏళ్లలో కాలిఫోర్నియా డిజైన్ డెన్ యు.ఎస్.లో వినియోగదారుల నుంచి చక్కని ఆదరణను దక్కించుకుంది. ఈ ఏడాది మా మొదటి ప్రైమ్ డే జపాన్ మార్కెట్లో ఉంది మరియు మేము రోజువారీ విక్రయాల్లో 15 రెట్లు వృద్ధి చేసుకునేందుకు సాధ్యమైంది’’ అని కాలిఫోర్నియా డిజైన్ డెన్ సహ-వ్యవస్థాపకుడు దీపక్ మెహ్రోత్రా తెలిపారు.
ప్రపంచం నుంచి ప్రశంసలు అందుకునేలా భారతదేశపు ఉత్పత్తుల రూపకల్పన
అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ ప్రోగ్రామ్‌లో భాగంగా భారతదేశంలోని ఎగుమతిదారులతో కలిసి పని చేస్తుండగా, ప్రముఖ షాపింగ్ పోకడలను గుర్తించడమే కాకుండా వారి ఇన్వెంటరీ సిద్ధం చేసుకునేందుకు లాజిస్టిక్స్ పరిహారం అందించేందుకు మరియు ఎంపిక చేసుకునేందుకు డీల్స్ శ్రేణి మరియు ప్రకటనల ఎంపికలను శిఫార్సు చూస్తుంది.
సిరోనా వ్యవస్థాపకుడు దీప్ బజాజ్ మాట్లాడుతూ, ‘‘2016లో మేము కార్యాచరణ ప్రారంభించిన వెంటనే అమెజాన్‌లో చేరుకున్నాము. నేడు మేము మహిళల రుతుచక్రం సంరక్షణ మరియు ఇంటిమేట్ కేర్‌లో యు.ఎస్., ఆస్ట్రేలియా తదితర ప్రాంతాల్లో బెస్ట్ సెల్లర్లలో ఒకరిగా ఉన్నాము. అమెజాన్‌లో ఈ కొన్నేళ్లలోనే మేము చక్కని వృద్ధి సాధించాము మరియు గత ఏడాది ప్రొపెల్ యాక్సలేటర్ ప్రోగ్రామ్ విజేతల్లో ఒకరిగా నిలిచాము. మాకు ప్రైమ్ డే వ్యాపార ప్రగతికి ప్రముఖ ఎనేబ్లర్‌గా నిలిచింది; మేము అమెజాన్.కాం (యుఎస్ఏ)లో 2 రెట్లు వృద్ధి సాధించాము. పీ బడ్డీ, స్వెట్ ప్యాడ్స్, డిస్పోజబుల్ బ్యాగ్స్ వంటి మా ఆవిష్కారాత్మక ఉత్పత్తులకు ఎక్కువ డిమాండ్ ఉంది’’ అని తెలిపారు.
ప్రపంచానికి నాణ్యత ఉత్పత్తులను నిర్మించడం గురించి సిల్క్మ్యాటిక్స్ సంస్థకు చెందిన ధవ్నిల్ మాట్లాడుతూ, ‘‘మేము బాలలకు ఆటల ద్వారా నేర్చుకునేందుకు ఆవిషారాత్మక మరియు సమగ్ర విధానాలను సృష్టించేందుకు కట్టుబడి ఉన్నాము మరియు భారతదేశం నుంచి ప్రపంచం అత్యుత్తమ లెర్నింగ్ టాయ్స్ బ్రాండ్‌ను సృష్టించేందుకు కట్టుబడి ఉన్నాము’’ అని తెలిపారు. విక్రేతలకు ప్రపంచ వ్యాప్తంగా విజయాన్ని అందించే దిశలో మద్ధతు ఇచ్చేందుకు అమెజాన్ తన నిబద్ధతను పునరుశ్చరించిన భూపేన్ వకంకర్ మాట్లాడుతూ, ‘‘మేము 2025 నాటికి 20 బిలియన్ డాలర్ల మేర ఎగుమంతి సాధించే దిశలో శ్రమిస్తుండగా, అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ ఎగుమతులను సరళం చేసేందుకు అలాగే చిన్న వ్యాపారాలకు అందుబాటులో ఉండేలా చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చింది. దేశం నుంచి ఎగుమతులను ఉత్తేజించే ప్రభుత్వ లక్ష్యానికి తన సహకారాన్ని ఇస్తోంది’’ అని వివరించారు.