Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2027 నాటికల్లా 500 మందికిపైగా ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి
- ఆంధ్రప్రదేశ్ లో విస్తృతమైన CNG స్టేషన్లు, పైప్ లైన్ నెట్వర్క్ సదుపాయాల ద్వారా సీఎన్ జి , పీఎన్ జి లను సులభంగా సరఫరా చేసేందుకు ప్రణాళికను ప్రకటించిన ఏజీఅండ్ పీ ప్రథమ్.
- కడపలో ఏర్పాటు చేయనున్న LCNG స్టేషన్ తో కడప ప్రజలకు ప్రయోజనం. వారు సులభంగా సహజవాయువు పొందడంతోపాటు, కాలుష్యం తగ్గి పర్యావరణనానికి మేలు చేస్తుంది.
కడప : బలమైన పైప్ లైన్ మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా రాష్ట్ర ప్రజలకు ప్రతక్ష, పరోక్ష ఉపాధిని సృష్టించడానికి స్థానికులతో కలసి పని చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామర్థాన్ని ఉపయోగించుకునే లక్ష్యంతో, ప్రముఖ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అయిన ఏజీ అండ్ పీ ప్రథమ్, గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయడానికి వచ్చే ఐదేండ్లలో కడప జిల్లాలో రూ. 200 కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ పెట్టుబడులు జిల్లాలో 500 మందికి పైగా ప్రజలకు ప్రతక్ష మరియు పరోక్ష ఉపాధిని కూడా అందిస్తాయి.
భారతదేశ ప్రధాన మంత్రి దార్శనికతకు అనుగుణంగా, మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రోత్సహంతో సహజ వాయువు ఆధారిత ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకుపోవడానికి ఏజీ అండ్ పీ అవిశ్రాంతగా కృషి చేస్తోంది. ఈ మేరకు స్థానిక వినియెగదారులకు ,వంటశాలలకు సహజ వాయువును అందించడానికి, రవాణా రంగం కోసం సీ ఎన్ జీ ఫిల్లింగ్ స్టేషన్లకు సహజ వాయువుని తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి 4 జిల్లాలలో అంతటా గ్యాస్ పైప్ లైన్ నెట్ వర్కును , ఏ జీ అండ్ పీ ప్రథమ్ వైఎస్సార్ జిల్లాలోని కడప లో ఎల్ సీ ఎన్ జీ ప్లాంటు ను ఏర్పాటు చేస్తోంది. కడప నగరానికి వంట ఇంధనం , సీ ఎన్ జీ లను సమర్థంగా అందించేలా ఈ ప్లాంటు ఉంది. కడప ఎల్ సీ ఎన్ జీ నిర్మాణంతో కడప జిల్లా ప్రజలకు వారి ఇంధన బిల్లు ఖరీదు అయిన పెట్రోలు కంటే 30 శాతం తగ్గించడం, ఎల్ పీ జీ సిలిండర్ కంటే వంట ఇంధనంలో 20 శాతం ఆదా చేయడం సాధ్యమవుతాయి. దాంతోపాటు, పారిశ్రామీకరణను వేగవంతం చేసే ఉద్యోగాలను సృష్టించి, కలుషాన్ని తగ్గించే, సుస్థిరమైన వాతావరణాన్ని పెంపొందించే సహజవాయువును అందించడం ద్వారా కడప జిల్లా ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. త్వదార పౌరుల జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది.
ఈ సందర్భంగా ఏజీఅండ్ పీ ప్రథమ్ కడప జిల్లా ప్రాంతీయాధిపతి గుమాలపల్లి వెంకటేశ్ మాట్లాడుతూ.. 'కడపను స్వచ్ఛమైన జిల్లా చేయడానికి ఏజీ అండ్ పీ ప్రథమ్ కృషిచేస్తోంది. ఇందుకోసం చవకయినా సహజవాయువును సులభంగా అందిస్తోంది. దింతో ఈ జిల్లా ప్రజలు తమ జీవితాలను మరింత సుఖంగా గడపగలరు. ఆంధ్రప్రదేశ్ విషయంలో మరింత విస్తృతంగా అలోచించి, ఏజీ అండ్ పీ ప్రథమ్ కడపలో ఎల్సిఎన్జి స్టేషన్‌ను అభివృద్ధి చేయడం, సెప్టెంబర్ 2022 నాటికి ప్లాంటు నిర్మాణ పనులు పూర్తి చేసి మరియు జిల్లా అధికారులు సహకారంతో ప్రారంభించడం జరుగుతుంది. ప్లాంట్, మరియు పైప్‌లైన్ నిర్మాణానికి సహకరించిన జిల్లా అధికారులకు ప్రత్యేకముగా ధన్యవాదములు తెలుపుచున్నాము ఈ LCNG స్టేషన్ ఏర్పాటు అనేక డిమాండ్ కేంద్రాలకు గ్యాస్ సరఫరా చేయడానికి ఉద్దేశించబడింది, పెట్రోలియం & సహజ వాయువు నియంత్రణ మండలి (PNGRB) ద్వారా పేర్కొన్న సహజ వాయువు పైప్లైన్ల భద్రతా ప్రమాణాలతో సహా అన్ని సాంకేతిక ప్రమాణాలు మరియు స్పెసిఫికేషన్లను అనుసరిస్తుంది.. కడప మున్సిపల్ కార్పొరేషన్ (KMC) పరిధిలోకి వచ్చే పుట్లంపల్లి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా (IDA)లో వ్యూహాత్మకంగా ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి దశలో పుట్లంపల్లి నుంచి సైనిక్‌నగర్, విక్లాంగ్నగర్, రామాంజనేయపురం, స్వరాజ్‌నగర్, అరవింద్‌నగర్, ప్రకాష్‌నగర్, ఎన్జీవో కాలనీ, రెడ్డి కాలనీ, భాగ్యనగర్ కాలనీ, వైఎస్ఆర్ కాలనీ వరకు సహజవాయువు పైపులైన్ పనులు, ఇంటి కనెక్షన్లు ఇప్పటికే ప్రారంభమ య్యాయి. ఇది 24x7 గృహ వంటశాలలలో సహజ వాయువు నిరంతరాయ సరఫరాను నిర్ధారిస్తుంది. పారిశ్రామికీకరణను వేగవంతం చేయడం, ఉద్యోగాలను సృష్టించడం, కాలుష్యాన్ని తగ్గించడం మరియు స్థిరమైన వాతావరణాన్ని పెంపొందించడం, తద్వారా పౌరుల జీవన నాణ్యతను పెంపొందించే సహజ వాయువు యాక్సెస్‌ను అనుమతించడం ద్వారా ఈ స్టేషన్ అభివృద్ధి ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని మేము విశ్వసిస్తున్నాము` అని అన్నారు.