Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : డౌన్లోడ్లు మరియు క్రియాశీలక వినియోగదారుల నుంచి భారతదేశపు నం.1 మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్, వింక్ మ్యూజిక్ నేడు భారతదేశం అలాగే విదేశాల్లో నివశిస్తున్న స్వతంత్ర కళాకారులకు భారతదేశంలోని అతి పెద్ద సంగీత వితరణ వ్యవస్థను పరిచయం చేస్తోంది. కళాకారులు తమ సంగీతాన్ని విడుదల చేసేందుకు ఈ స్టూడియో సహకరిస్తుంది అలాగే వారికి పలు ప్లాట్‌ఫారాల్లో సంగీతం ద్వారా నగదు సంపాదించేందుకు కూడా సహకారాన్ని అందిస్తుంది మరియు వింక్, ఎయిర్టెల్, ఎక్స్‌స్ట్రీమ్, ఎయిర్టెల్ యాడ్స్, ఎయిర్టెల్ ఐక్యూ తదితర ఎయిర్టెల్ డిజిటల్ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోలో భాగమయ్యేందుకు సహకారాన్ని అందిస్తుంది. వింక్ స్టూడియో ద్వారా భారతదేశంలో మ్యూజిక్ ఎకోసిస్టాన్ని విస్తరించడంలో ఎయిర్టెల్ మహోన్నతమైన అడుగు ముందుకు వేసింది. ఈ స్టూడియో వచ్చే 1 ఏడాదిలో 5,000 స్వతంత్ర కళాకారులను పరిచయం చేసే ప్రణాళికను కలిగి ఉంది. ఇది సంగీత పరిశ్రమలో అజ్ఞాత కళాకారులు ఎదుర్కొంటున్న మూడు ప్రముఖ సమస్యలైన తమ మ్యూజిక్ ఆల్బంల విడుదల, నగదు సంపాదన మరియు అనలిటిక్స్ సమస్యలను అధిగమించడం ద్వారా భారతదేశంలో సంగీత పరిశ్రమలో విజయాన్ని మరియు ఓటమి మధ్య తేడాను నిర్ణయిస్తుంది. భారతదేశంలోని సంగీత పరిశ్రమ మార్పు దశలో ఉంది. భారతీయులు ప్రతి వారం 21 గంటలు సంగీతాన్ని ఆలకించడంలో సమయాన్ని గడుపుతుండగా, గ్లోబల్ సగటు 18 గంటలు ఉంది. భారతదేశంలో ఏదైనా మ్యూజిక్ ప్లాట్ఫారంలో 30శాతం మేర పాటలు నేడు స్వతంత్ర కళాకారుల సృష్టిగా ఉన్నాయి మరియు ఇండిపెండెంట్ కళాకారులు పరిశ్రమ ప్రగతిని 50% మేర ముందంజలోకి తీసుకు వెళుతుండగా, 2025 నాటికి ప్రస్తుతం ఉన్న రూ.2000 కోట్ల నుంచి రూ.3000 కోట్లకు వృద్ధి చెందుతుందని అంచనాలు ఉన్నాయి.
వింక్ స్టూడియో కళాకారులకు ఎలా సహకారాన్ని అందిస్తుంది:
ఆవిష్కరణ- కళాకారులకు వారి సంగీతాన్ని వింక్ మ్యూజిక్ యాప్‌లో అలాగే ఇతర మ్యూజిక్ ప్లాట్‌ఫారాల్లో విడుదల చేసేందుకు సహకరిస్తుంది. సంగీతం ఆలకించే వారు వింక్ యాప్‌లో వారికి ఇష్టమైన కళాకారుల సంగీతాన్ని సేవ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు ఫాలో కావచ్చు.
నగదు సంపాదన- ఇప్పుడే వృద్ధిలోకి వస్తున్న కళాకారులకు ఎయిర్‌టెల్‌కు ఉన్న సదృఢమైన వితరణ సామర్థ్యాలకు మద్ధతు ఇవ్వడం ద్వారా రికార్డు స్థాయిలో స్ట్రీమ్‌లను సాధించేందుకు మద్ధతు ఇస్తుంది. దీనితో కళాకారులకు ప్రతి ఒక స్ట్రీమ్‌లోనూ స్థిరమైన సంపాదన ఇవ్వడం ద్వారా వారికి సంగీతాన్ని వృత్తిగా మార్చుకునేందుకు సహకరిస్తుంది.
పారదర్శకత మరియు డేటా అనలిటిక్స్- ఎయిర్‌టెల్‌లో లోతైన డేటా సైన్స్ సామర్థ్యాలను ఉపయోగించుకుని కళాకారులు ఇప్పుడు వారి ఫాలోయర్లు ఆనందించే సంగీతాన్ని సృష్టించవచ్చు మరియు వారికి వాణిజ్యాత్మకంగా ఉపయుక్తమయ్యే సంగీతాన్ని సృష్టించేందుకు సహకరించవచ్చు.
వింక్ స్టూడియో మాధ్యమంగా మరియు ఎయిర్‌టెల్‌కు అసాధారణమైన వ్యాప్తితో సహకారాన్ని అందుకుని, ఇండిపెండెంట్ కళాకారులకు వారి ధ్వనిని శ్రోతలకు నేరుగా తోడ్కొని వెళ్లే మహోన్నతమైన అవకాశాన్ని ఇస్తుంది. స్థానిక ప్రతిభలను ఉత్తేజించేందుకు వింక్ ఈ అప్లికేషన్‌కు రూ.100 కోట్లు రిజర్వు చేసింది మరియు వారి ఆవిష్కరణలకు మద్ధతు ఇస్తుంది.
వింక్ స్టూడియో ఇప్పటికే భారత్, సింగపూర్ మరియు యునైటెడ్ స్టేట్స్ నుంచి 100కు పైగా ఎక్కువ మంది కళాకారులకు కలిగి ఉండగా, వారిలో బ్యాంకర్‌గా సంగీతాన్ని పూర్తి సమయం కొనసాగించాలని కోరుకున్న పునెకు చెందిన నిషద్ పట్కి ఉన్నారు. ముంబయికి చెందిన ప్రతీక్ గాంధీ (34 మిలియన్ స్ట్రీమ్‌ల), బెంగళూరుకు చెందిన గగన్ బడేరియా (17 మిలియన్ స్ట్రీమ్‌లు) మరియు హైదరాబాద్‌కు చెందిన హర్ష ప్రవీణ్ (20 మిలియన్ స్ట్రీమ్‌లు), మరియు చిన్న నగరాల సెన్సేషన్ అయిన హల్ద్వానియ అజయ్ నాగర్కోటి మరియు వాపియర్కు చెందిన డి-షా తదతర కళాకారులు ఒక మిలియన్ స్ట్రీమ్‌లకు అందుకున్న వారిలో ఉన్నారు.
దీన్ని అందుబాటులోకి తీసుకు రావడం గురించి ఎయిర్టెల్ డిజిటల్ సీఈఓ ఆదర్శ్ నాయర్ మాట్లాడుతూ, ‘‘మ్యూజిక్ క్రియేటర్ ఎకానమి అత్యంత బాల్యావస్థలో ఉండగా, గమనార్హంగా వృద్ధి చెందేందుకు సిద్ధంగా ఉంది. వింక్ స్టూడియో ద్వారా మేము వృద్ధిలోకి వస్తున్న సంగీత కళాకారులను వారి ఆసక్తులను వృద్ధి చేసుకునేందుకు మరియు అదే సమయంలో సంపాదించుకునేందుకు వేదికను రూపొందిస్తున్నాము. మ్యూజిక్ స్ట్రీమింగ్‌లో ఎయిర్‌టెల్‌కు ఉన్న అనుభవం, అపారమైన వ్యాప్తిని సాధించే సామర్థ్యం మరియు 350 మిలియన్ వినియోగదారులలో సుదీర్ఘ బాంధవ్యంతో పరిశ్రమలోని వాటాదారులు అందరికీ సమానమైన మరియు పురస్కృత ప్రయాణపు భరోసాను అందిస్తున్నాము. ప్రపంచంలోని అన్నివైపుల నుంచి ప్రతిభలను ఆకర్షించే నిరీక్షను కలిగి ఉన్నాము మరియు వచ్చే 1 ఏడాదిలో 5,000 మంది కళాకారులకు ఈ వేదికను విస్తరించే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాము’’ అని వివరించారు.
గత కొన్నేళ్ల నుంచి బాలీవుడ్ మరియు అంతర్జాతీయ సంగీతం అపారంగా ఆకట్టుకుంటున్నప్పటికీ ప్రాంతీయ సంగీతానికి డిమాండ్ ఎక్కువ అవుతోంది. స్మార్ట్‌ఫోన్ వినియోగం ఎక్కువ అవుతున్న కొద్దీ ప్రాంతీయ భాషలు మరియు ప్రాంతీయ భాషల్లోని స్థానిక కళాకారులకూ డిమాండ్ ఎక్కువైంది. సంగీతాన్ని 15 భారతీయ భాషల్లో వింక్ అందిస్తోంది మరియు ప్రాంతీయ పాటలు ఇప్పుడు యాప్‌లో మొత్తం స్ట్రీమ్‌లలో 30% కన్నా ఎక్కువగా ఉన్నాయి. ఒరియా, గుజరాతీ, అస్సామీ, మరాఠి, తెలుగు మరియు భోజ్‌పురి 150+ శాతం ప్రగతి సాధించాయి మరియు సొంత రాష్ట్రాల కన్నా ఇతర ప్రాంతాల్లో ఎక్కువ ప్రజాదరణ పొందుతున్నాయి.