Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.1000 కోట్ల మనీలాండరింగ్..!
న్యూఢిల్లీ:దేశంలోని పలు క్రిప్టో కరెన్సీ ఎక్సేంజీలు మనీలాండరింగ్ కు పాల్పడ్డాయనే అనుమానాల నేపథ్యంలో ఆ సంస్థలపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టి సారించింది. 10 ఎక్సేంజీలు దాదా పు రూ.1000 కోట్ల మనీలాండరింగ్ చేశాయని అరోపణలు వస్తున్నా యి. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 5న జన్మయి ల్యాబ్ ప్రయివేటు లిమిటెడ్ డైరెక్టర్ల ఇండ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేసింది. ఈ సంస్థ వజీర్ఎక్స్ క్రిప్టో కరెన్సీ ఎక్సేంజీని నిర్వహిస్తుంది. ఈ సంస్థకు చెందిన రూ.64.67 కోట్ల బ్యాంక్ ఖాతాలను ఈడీ జప్తు చేసింది. మరో ఎక్సేంజీ లోనూ ఇలాంటి లావాదేవీలు చోటు చేసుకున్నాయని ఈడీ వర్గాలు గుర్తించాయి. ఇన్వెస్టర్లకు సంబంధించిన ఎలాంటి కెవైసి లేకుండానే క్రిప్టో ఎక్సేంజీలు లావాదేవీలకు ఆస్కారం ఇచ్చాయని ఈడీ విచారణలో తేలింది. ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేసిందని సమాచారం.
ఏడు శాతం మంది వద్ద కరెన్సీ..
భారత్లో 2021 ముగింపు నాటికి ఏడు శాతం మంది వద్ద క్రిప్టో కరెన్సీలు ఉన్నాయని ఐక్యరాజ్య సమితి తన 'యుఎస్ ట్రేడ్ అండ్ డెవల ప్మెంట్'లో తెలిపింది. జనాభాపరంగా అత్యధిక మంది క్రిప్టో కరెన్సీలు కలిగిన తొలి 20 దేశాల్లో 15 అభివృద్థి చెందుతున్న దేశాలేనని పేర్కొం ది. అత్యధికంగా ఉక్రెయిన్ ప్రజల్లో 12.7 శాతం మంది వద్ద క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి. భారత్లో 7.3 శాతం ప్రజల వద్ద క్రిప్టోలు ఉన్నా యని.. దీంతో ఏడో స్థానంలో ఉందని ఈ రిపోర్ట్ పేర్కొంది. క్రిప్టో కరెన్సీల వల్ల తీవ్ర ఆర్థిక, సామాజిక దుష్ప్రభవాలు ఉంటాయని ఐరాస హెచ్చరించింది. ఇవి దేశాల సౌరభౌమత్వానికే ప్రమాదమని తెలిపింది.