Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మల్టీబ్రాండ్ మొబైల్ రిటైల్ రంగంలో వేగంగా విస్తరిస్తోన్న లాట్ మొబైల్స్ 10వ వార్షికోత్సవం సందర్బంగా అద్బుత ఆఫర్లను అందిస్తున్నట్టు ప్రకటించిం ది. దక్షిణాదిలో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన తమ అన్ని స్టోర్లలో బ్రాండెడ్ మొబైల్స్, స్మార్ట్ టివిలు, ల్యాప్‌ట్యాప్, స్మార్ట్‌వాచీలు తదితర ఉత్పత్తులను అందుబాటులో ఉంచామని లాట్ మొబైల్స్ డైరెక్టర్ యం అఖిల్ తెలిపారు. తాజాగా ఇన్వర్టర్లు, ప్రింటర్లను కూడా విక్రయిస్తోన్నామన్నారు. వార్షికోత్సవ ఆఫర్లలో ప్రతీ స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై ఫైర్ బోల్డ్ కాలింగ్ వాచ్ లేదా మాక్సెల్ టవర్ ఫ్యాన్ కాంబోను అందిస్తున్నామన్నారు. స్మార్ట్టివిలు రూ.9999, ల్యాప్‌టాప్ లు రూ.17,499 నుంచి లభిస్తాయన్నారు. ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్‌పై 7.5 శాతం వరకు తక్షణ క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను అందిస్తున్నామన్నారు. పలు కంపెనీల మొబైళ్లపై రూ.6వేల వరకు రాయితీ ఇస్తున్నామన్నారు.