Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో పిట్టీ ఇంజనీరింగ్ రెవెన్యూ 77 శాతం పెరిగి రూ.311 కోట్లుగా నమోదయ్యింది. ఇదే సమయంలో కంపెనీ నికర లాభాలు 59 శాతం పెరిగి రూ.12 కోట్లకు చేరాయని ఆ కంపెనీ తెలిపింది. అధిక డిమాండ్ మెరుగైన ఆర్థిక ఫలితాలకు దోహదం చేశాయని పేర్కొంది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.7 కోట్ల లాభాలు నమోదు చేసింది. క్రితం క్యూ1లో కంపెనీ వినియోగ సామర్థ్యం 74 శాతంగా చోటు చేసుకుందని వెల్లడించింది. జూన్ ముగింపు నాటికి చేతిలో రూ.948 కోట్ల ఆర్డర్లున్నాయని ఆ కంపెనీ ఎండి అక్షరు ఎస్ పిట్టి తెలిపారు.