Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక
హైదరాబాద్ : తాజా అంచనాలలో, నైట్ ఫ్రాంక్ ఇండియా జూలై 2022లో 4,313 యూనిట్ల రెసిడెన్షియల్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లను నమోదు చేసింది, ఇది నెలవారీగా చూస్తే 20% తక్కువగా ఉంది (MoM). INR 50 లక్షలు మరియు దానికంటే ఎక్కువ విలువ గల ఆస్తుల మీద గత నెలలో తక్కువ లావాదేవీలు జరగడం ఈ మందగమనానికి కారణమయ్యింది. పెరుగుతున్న వడ్డీ రేట్లపై అనిశ్చితితో పాటు 'ఆషాడ మాసం'లో ప్రధాన పెట్టుబడి నిర్ణయాల పట్ల వుండే ప్రతికూల భావాలు ఈ తగ్గుదలకు కారణమయ్యాయి. జూలై 2022లో లావాదేవీలు జరిపిన ఆస్తుల మొత్తం విలువ INR 2,101 కోట్లుగా ఉంది, అలాగే 26% MoM క్షీణతను నమోదు చేసింది. సంవత్సరం ప్రారంభం నుండి, మొత్తం INR 20,023 కోట్ల విలువ గల 40,897 రెసిడెన్షియల్ యూనిట్ల అమ్మకాలకు నగరం సాక్ష్యంగా నిలిచింది. హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్లో హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి మరియు సంగారెడ్డి అనే నాలుగు జిల్లాలు ఉన్నాయి.