Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: డాలర్‌తో రూపా యి మారకం విలువ భారీగా పడి పోవడంతో ఆ ప్రభావం భారత విదేశీ మారకం నిల్వలపై తీవ్రంగా పడుతోంది. వరుసగా ఐదు వారా లుగా మారకం నిల్వల్లో తగ్గుదల చోటు చేసుకుంది. ఆగస్టు 5తో ముగిసిన వారంలోనూ 897 మిలియన్ డాలర్లు తగ్గి 572.978 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయని ఆర్బీఐ వెల్లడించింది. ఎగుమతుల కన్నా దిగుమతులు పెరగడం, రూపాయి విలువ పతనం, స్టాక్ మార్కెట్ల నుంచి ఎఫ్ఐఐలు తరలిపోవడం తదితర పరిణామాలు విదేశీ మారకం నిల్వలు తరిగిపోవడానికి ప్రధాన కారణం. గతేడాది సెప్టెంబర్ 3న రికార్డ్ స్థాయిలో 642 బిలియన్ డాలర్లుగా నమోద యిన విదేశీ మారకం నిల్వలు క్రమంగా పడిపోతూ... ఆర్థిక వ్యవస్థలో ఆందోళనలు పెంచుతోంది. ప్రస్తుత నిల్వలు కేవలం 10 నెలల దిగుమ తులకు మాత్రం సరిపోతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.