Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీపీసీఎల్ వెల్లడి
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) వచ్చే ఐదేండ్ల లో రూ.1.4 లక్షల కోట్ల పెట్టుబడు లు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ వ్యయాలు పెట్రోకెమికల్స్, సిటీ గ్యాస్, క్లీన్ ఎనర్జీ విభాగాల్లో చేయనున్నామని ఆ సంస్థ సోమవారం ప్రకటించింది. ఇంధనేతర వ్యాపార వృద్థిపై దృష్టి పెడుతోన్నామని బీపీ సీఎల్ సీఎండీ అరుణ్ కుమార్ సింగ్ కంపెనీ వార్షిక రిపోర్ట్‌లో పేర్కొ న్నారు. బీపీసీఎల్‌కు భారత్‌లో 83,685 పెట్రోల్ పంపులు ఉండగా.. ఇందులో 20,212 సొంతవే కావడం విశేషం. అదే విధంగా ఈవీ చార్జీ ంగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే పనిలో ఉంది. దేశంలో రెండో అతి పెద్ద రిఫైనరీ కంపెనీగా ఉండి.. లక్షల కోట్ల ఆస్తులు కలిగిన ఈ సంస్థను మోడీ సర్కార్ ప్రయివేటుకు అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే.