Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సురక్షితమైన బ్యాంకింగ్ అలవాట్లను పాటించేలా భారతీయులను ప్రేరేపించడం ద్వారా 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను జరుపుకుంటున్న హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్
లోలా కుట్టి ఫేమ్ అనురాధ మీనన్ కథానాయికగా జరగనున్న ప్రచారం
ముంబై : భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలైన సందర్భాన్ని పురస్కరించుకుని, దేశవ్యాప్తంగా ప్రజల్ని సురక్షితమైన బ్యాంకింగ్ అలవాట్లను అభ్యసించడానికి ప్రోత్సహించే 'విజిల్ ఆంటీ` అనే కొత్త ప్రచారాన్ని మంగళవారం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ప్రకటించింది. ఇది ప్రజలు తమ గోప్యమైన బ్యాంకింగ్ సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని కోరే బ్యాంక్ యొక్క ప్రసిద్ధ 'మూహ్ బంధ్ రఖో` అనే ప్రచారానికి విలువని చేకూరుస్తుంది.
లోలా కుట్టి క్యారెక్టర్ని పాపులర్ చేసిన అనురాధ (అను) మీనన్ ఈ ప్రచారానికి కథానాయిక. వరుస వీడియోలు, రీల్స్, చాట్ షోల ద్వారా మీనన్ విజిల్ ఆంటీగా సురక్షితమైన బ్యాంకింగ్ కోసం చేయాల్సినవి మరియు చేయకూడని పనులపై అవగాహన కల్పిస్తారు.
విజిల్ ఆంటీ పౌరులకు ఆర్థిక మోసగాళ్ల కార్యనిర్వహణ విధానం, సైబర్ మోసం ప్రయత్నాలను గుర్తించే మార్గాలు మరియు సురక్షితంగా ఎలా ఉండాలనే దాని గురించి తెలియజేయడం ద్వారా వారిని అప్రమత్తంగా ఉండేలా ప్రేరేపిస్తుంది. ఆమె సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చాట్ షోలను హోస్ట్ చేస్తుంది మరియు ఇటీవల జరిగిన కొన్ని సైబర్ మోసాల సంఘటనలను గురించి ప్రముఖ అతిథులతో చర్చిస్తుంది.
విజిల్ ఆంటీ ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్లో ఉనికితో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఉండబోతోంది. కస్టమర్లతో కనెక్ట్ అవ్వడానికి ఆమె తన సొంత వాట్సాప్ నంబర్ (+91 72900 30000) కూడా కలిగి ఉంటుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వెబ్సైట్లో సైబర్ మోసాలపై అవగాహన కల్పించే ప్రత్యేక పేజీ ఉంటుంది.
ఈ ప్రచారాన్ని ప్రారంభించడంపై, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీ సమీర్ రటోలికర్ వ్యాఖ్యానిస్తూ: 'కస్టమర్ల బ్యాంకు ఖాతాల నుంచి డబ్బును దొంగిలించేందుకు మోసగాళ్లు సోషల్ ఇంజనీరింగ్ వ్యూహాలను ఎక్కువగా అవలంబిస్తున్నారు. నిర్దిష్ట సేవలను లేదా సహాయాన్ని అందిస్తామనే సాకుతో, మోసగాళ్లు కస్టమర్లను వారి పిన్లు, ఓటీపీలు, పాస్వర్డ్లు మరియు ఇతర రహస్య బ్యాంకింగ్ సమాచారాన్ని వారితో పంచుకునేలా ఆకర్షిస్తున్నారు. అందువల్ల, సురక్షితమైన బ్యాంకింగ్ అలవాట్లపై కస్టమర్లకు అవగాహన కల్పించడంతోపాటు మోసగాళ్లు ఉపయోగించే వివిధ విధానాల గురించి వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో, ఈ అవగాహన కల్పించడంలో మా పాత్రను మేము గుర్తించాము` అని పేర్కొన్నారు.
'ఆన్లైన్ ప్రపంచంలో, ఆహారం మొదలుకుని ప్రయాణం మరియు వినోదం వరకు అనేక రకాల విషయాలపై సమాచారం మరియు మార్గదర్శకత్వం కోసం కస్టమర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మరియు కంటెంట్ సృష్టికర్తలను ఎక్కువగా అనుసరిస్తున్నారు. అందువల్ల, కస్టమర్లకు సురక్షితమైన బ్యాంకింగ్ అలవాట్లపై సమాచారాన్ని అందించడానికి మా స్వంత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, విజిల్ ఆంటీని సృష్టించాలని మేము నిర్ణయించుకున్నాము. అను మీనన్ ప్రజలతో మమేకమవడంలో అత్యంత ప్రభావవంతమైన పాత్రను పోషించింది. ఆమె హాస్య చర్యలు మరియు అనేక భాషలపై ఆమెకున్న పట్టుతో, సురక్షితమైన బ్యాంకింగ్ అలవాట్లను అవలంబించడంలో ఆమె దేశవ్యాప్తంగా ప్రజలను ప్రేరేపించగలదని మేము నమ్ముతున్నాం. ఈ అంశంపై అవగాహన కల్పించడం ద్వారా మోసం నుండి స్వేచ్ఛను ప్రోత్సహించే ప్రచారంతో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75వ సంవత్సరాన్ని గుర్తించాలని మేము నిర్ణయించుకున్నాము` అని మిస్టర్ రవి సంతానం, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మరియు హెడ్ - కార్పొరేట్ కమ్యూనికేషన్స్, లయబిలిటీ ప్రొడక్ట్స్ అండ్ మేనేజ్డ్ ప్రోగ్రామ్స్ పేర్కొన్నారు.
విజిల్ ఆంటీని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి మరియు సోషల్ మీడియా, వాట్సాప్ ద్వారా ఆమెను అనుసరించేలా ప్రజలను ప్రోత్సహించడానికి ఈ ప్రచారం నాలుగు నుండి ఆరు వారాల పాటు కొనసాగుతుంది. అయితే, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా విజిల్ ఆంటీ డిజిటల్ ఎకోసిస్టమ్‌లో నిరంతర ఉనికిని కలిగి ఉంటుంది మరియు ఆర్థిక మోసగాళ్ల యొక్క వివిధ విధానాల గురించి మరియు వారి నుండి ఎలా సురక్షితంగా ఉండాలనే దాని గురించి కస్టమర్లకు తెలియజేస్తూనే ఉంటుంది.
మోసాల నివారణపై హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ముందునుంచే వినియోగదారులకు అవగాహన కల్పిస్తోంది.. నవంబర్ 2021 నుండి, బ్యాంక్ దేశవ్యాప్తంగా 2,800 కంటే ఎక్కువ సురక్షిత బ్యాంకింగ్ వర్క్‌షాప్‌లను నిర్వహించింది. ఈ వర్క్‌షాప్‌లలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యా సంస్థలు, చట్టాన్ని అమలు చేసే సంస్థలు, సీనియర్ సిటిజన్లు, ఛానెల్ భాగస్వాములు మరియు హౌసింగ్ సొసైటీలు పాల్గొన్నారు.