Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని దిగ్గజ బ్యాంక్ ఎస్బీఐ తాజాగా విక లాంగులకు ఉచితంగా ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నట్లు ప్రకటించింది. తమ ఈ ఖాతాదారు లకు నెలకు మూడు సార్లు ఉచిత సేవలు ఇవ్వనున్నట్లు ఎస్బీఐ ఓ ట్వీట్లో తెలిపింది. నగదు తీసుకోవ డం, నగదు ఇవ్వడం, చెక్లు తీసుకోవడం, కేవైసీ పత్రాల నమోదు, టర్మ్ డిపాజిట్ డెలివరీ చేయడం తదితర సేవలు అందించనున్నట్టు పేర్కొంది. ఇందుకోసం తమ ఖాతాదారులు 1800 1037 188 లేదా 1800 1213 721 టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేయడం లేదా యోనో యాప్ ద్వారా ఉచిత డోర్ స్టెఫ్ సేవల కోసం రిజిస్ట్రర్ చేసుకోవాలని సూచించింది. కరోనా కాలంలో ప్రారంభించిన ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలకు చార్జీలు వసూలు చేస్తున్న విషయం తెలిసిందే.