Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ, ఆగస్టు 17, 2022 : స్మార్ట్ ఫోన్ మరియు టాబ్లెట్ ఉపకరణాల కోసం ఫ్రీ-టు-ప్లే (F2P) గేమ్స్ అగ్రగామి డెవలపర్ మరియు ప్రచురణకర్త అయిన మూంగ్ ల్యాబ్స్, డాల్బీ అట్మోస్ౖ లో తన ప్రముఖ మొబైల్ గేమ్ 'ఎపిక్ క్రికెట్` ని విడుదల చేయడానికి గాను డాల్బీ లేబొరేటరీస్ తో కలిసి పని చేసింది.
క్రికెట్ యొక్క నిజమైన వీరాభిమానుల కొరకు నిర్మించబడియున్న డాల్బీ అట్మోస్ లో ఎపిక్ క్రికెట్ ఒక విప్లవాత్మకమైనటువంటి మొబైల్ క్రికెట్ గేమింగ్ అనుభవం. అది ఇంతకు మునుపు ఎప్పుడూ లేనంతగా అద్భుతమైన మరియు నిశితంగా లీనమయ్యే గేమ్ ప్లేని అందజేస్తుంది. గేమ్ వెనుక జట్టు క్లిష్టమైన అల్గారిధంలు మరియు విశిష్టమైన టెక్నిక్ లతో సమృద్ధమై అద్భుతమైనటువంటి వాస్తవిక అనుభూతిని నిర్మింపజేస్తుంది. అది గేమ్ ఆడే వ్యక్తి యొక్క దృశ్య మరియు శ్రవణ జ్ఞానేంద్రియాలపై చిరకాలం నిలిచిపోయే ముద్ర వేస్తుంది.
డాల్బీ అట్మోస్ ద్వారా, ఎపిక్ క్రికెట్ లో కీలకమైన క్షణాలు మరింత వాస్తవికతను తలపింపజేస్తాయి. బంతి ప్రయాణిస్తుండగా ఆటగాడు స్టాండ్ల నుండి వీక్షక సమూహము యొక్క ఒక వైవిధ్యమైన హోరు ధ్వనిని మరియు ఆటగాడు తర్వాతి బంతిని ఎదుర్కోవడానికి సిద్ధమైనప్పుడు ఒక తరంగం వంటి శబ్దాన్ని అనుభూతి చెందగలుగుతాడు. పైపెచ్చుగా, స్టంప్స్ వెనుక వికెట్ కీపర్ మాటలు చాలా స్పష్టంగా వినగలగడం గేమ్ యొక్క వాస్తవికతను మరింతగా పెంచుతుంది. ఆటగాళ్ళు మరియు వీక్షకుల గుంపు యొక్క భావోద్వేగ హర్షాతిరేకాలు అన్నీ ఒక అధీకృత అనుభవాన్ని మీ ముందుకు తెస్తాయి, ఇంతకు మునుపు ఎన్నడూ లేని విధంగా ఆటగాణ్ణి ఆటకు అతుక్కుపోవడానికి వీలు కలిగిస్తాయి.
ఈ అభివృద్ధిపై వ్యాఖ్యానిస్తూ, మూంగ్ ల్యాబ్స్ హెడ్ ఆఫ్ ప్రోడక్ట్, సమిత్ బబ్బర్ మాట్లాడుతూ.. 'భారతీయ గేమర్ ఈ రోజున మొబైల్ పైన తమ అభిమానమైన గేమ్ ఆడుతూ ఒక నాణ్యమైన అనుభవాన్ని పొందుతున్నారు. డాల్బీ అట్మోస్ తో ఎపిక్ క్రికెట్ అనేది, గేమర్లు తాము పిచ్ మధ్యలో నిలుచొని స్వయంగా క్రికెట్ చూస్తున్నామా అన్నంతగా వాస్తవమైన పరిసర ధ్వనులతో ఆటలో లీనమైపోయి వారిని నిజమైన చర్యకు తీసుకువెళ్ళేలా ఒక కొత్త స్థాయి అనుభవాన్ని మీ ముందుకు తీసుకువస్తుంది. మీరు మీ జట్టును ఒక ఎపిక్ క్రికెట్ ప్రయాణానికి తీసుకువెళుతున్నట్లుగా, వీక్షక సమూహము యొక్క ధ్వని, ఉత్కంఠ మరియు హర్షాతిరేకాలలో మునిగిపోతారు` అన్నారు.
'మొబైల్-ఫస్ట్ దేశముగా ఉంటూ, మొబైల్ గేమింగ్ లో ఇండియా శరవేగంగా ఎదుగుతూ ఉంది. తమ స్మార్ట్ ఫోన్ల పైన అత్యద్భుతమైన ఆడియో అనుభవాల కోసం వినియోగదారుల నుండి నానాటికీ డిమాండ్ పెరుగుతూ వస్తోంది. గేమ్ ఆడుతున్నప్పుడు మరింత ఎక్కువ వాస్తవికమైన మరియు ఉత్కంఠతో కూడిన అనుభవాన్ని ఏర్పరచడానికై మేము సుస్పష్టమైన స్పష్టత, వివరము, మరియు ప్రగాఢతను అందించే డాల్బీ అట్మోస్ తో ఈ డిమాండును తీర్చబోతున్నాము. డాల్బీ అట్మోస్ తో ఎపిక్ క్రికెట్ ఆడుతున్నప్పుడు గేమర్లు ఒక సమృద్ధమైన అనుభూతిని ఆస్వాదిస్తారని మేము ధృఢమైన నమ్మకంతో ఉన్నాము` అని వివరించారు, డాల్బీ లేబొరేటరీస్, జపాన్ మరియు ఉద్భవిస్తున్న మార్కెట్ల సీనియర్ రీజియనల్ డైరెక్టర్ ఆషిమ్ మాథుర్.
డాల్బీ అట్మోస్ మరింత ఎక్కువ స్పష్టత మరియు పదునైన వివరముతో మీ ఆటను అనుభూతి చెందడానికి మీకు వీలు కల్పిస్తూ బహుముఖమైన ధ్వని తరంగాలలో మిమ్మల్ని చుట్టుముడుతుంది, అది సరిగ్గా ఆట చర్యల మధ్యలో మిమ్మల్ని నిలుపుతుంది. కచ్చితమైన పిన్-పాయింట్ కచ్చితత్వము ఇంతకు మునుపెన్నడూ లేని విధంగా మరింత వాస్తవమైన మరియు ఉత్కంఠ గొలిపే ఆట అనుభూతికై స్థానము మరియు ఆడియో దిశను మీకు చూపుతుంది.