Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఎయిర్ప్యూరిఫైయర్లతో గాలి నాణ్యత మెరుగుపడుతుందని మనందరికీ తెలుసు, కానీ ఈ ఎయిర్ప్యూరిఫైయర్లు అలెర్జీలు రాకుండా సహాయపడతాయా ? చాలా మంది భావించేది ఏమిటంటే, వర్షాకాలంలో గాలి శుభ్రపడుతుందని. కానీ అతి తక్కువ మందికి తెలిసిన వాస్తవమేమిటంటే, అలెర్జీలకు కారణమయ్యే ఎన్నో అంశాలను ఇది వెంట పెట్టుకుని వస్తుందని ! ఈ విషయమై డైసన్ వద్ద పర్యావరణ పరిరక్షణ, డిజైన్ మేనేజర్ ముజాఫర్ ఇజాముద్దీన్, అత్యున్నత స్థాయిలో ఉండే ఇండోర్ ఎలర్జీలను గురించి అవగాహన కల్పిస్తూనే, ఏ విధంగా కొన్ని రకాల ఎలర్జీలు గదిలోని గాలిని శుభ్రపరిచే రీతిలో తీర్చిదిద్దినదీ వెల్లడిస్తున్నారు. ఈ తరహా ఎయిర్ప్యూరిఫైయర్లు ఎలర్జీన్స్ను ఒడిసిపట్టడంతో పాటుగా ఫిల్టర్ చేయబడిన, స్వచ్ఛమైన గాలిని తిరిగి గదిలోకి ఎలా పంపేదీ ఆయన తెలిపారు.
మాన్సూన్ సీజన్లో ఇండోర్ గాలి నాణ్యత పరంగా ఏం జరుగుతుంది ?
వృద్ధి చెందిన పార్టిక్యులేట్ మ్యాటర్, వృద్ది చెందిన ఎలర్జీన్స్ - వర్షాకాలంలో తేమ శాతం గణనీయంగా పెరుగుతుంది మరియు మీ చుట్టు పక్కల ఎప్పుడూ తేమ వాతావరణం ఉంటుంది. దానితో పాటుగా అత్యధిక మొత్తంలో ఇండోర్ కాలుష్యకారకాల బారిన పడే అవకాశాలున్నాయి. ఇవి శ్వాస సంబంధిత ఎలర్జీలను కలిగించవచ్చు. ఈ ఎలర్జీలు అతి సాధారణం కావడంతో పాటుగా అసౌకర్యం, చికాకు కలిగిస్తాయి. మరీ ముఖ్యంగా మన ఇంటి లోపలి ఇండోర్ గాలి కాలుష్యకారకాలను కలిగి ఉంటుంది. దీనిని పార్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం) అంటారు. గాలిలో ఉండే ధూళి కణాలను సాధారణంగా పీఎంగా సంబోధిస్తుంటారు. వీటిలో పొలెన్ కణాలు, ధూళి కణాలు మరియు డస్ట్‌మైట్ విసర్జితాలు వంటివి ఉంటాయి. వీటితో పాటుగా గది బయటి కాలుష్యం నుంచి వచ్చే కణాలు, అంటే బ్రేక్ డస్ట్ మరియు వాహనాల నుంచి వచ్చే కాలుష్య కారకాలు కూడా ఉంటాయి. వీటిలో చాలా వరకూ పార్టికల్స్ 2.5 మైక్రాన్స్ పరిమాణంలో లేదా అంతకంటే పెద్దవిగా ఉంటాయి. ఇవి ఎలర్జీన్స్ మరియు భారీ కణాలు అయినటువంటి చర్మ కణాలు వంటివి ఇంటిలో ధూళి స్థాయిని గణనీయంగా పెంచుతాయి. వృద్ధి చెందిన తేమ కారణంగా, వర్షాకాలంలో ఈ సాధారణ ఎలర్జీలు సైతం గణనీయంగా పెరుగుతాయి.
గాలిలో పుప్పొడి స్థాయిలో పెరుగుదల : ఎలర్జీ వల్ల తరచుగా ఇబ్బంది పడే వ్యక్తులు తేమ వాతావరణం వల్ల పుప్పొడి శాతం తక్కువగా ఉంటుందని భావిస్తుంటారు. అది ఎల్లప్పుడూ వాస్తవం కాదు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉంటే, పుప్పొడి స్థాయి తగ్గేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే, ఇది నేరుగా గాలి వల్ల జనించే పుప్పొడిని తుడిచిపెడుతుంది. కానీ భారీ వర్షాల వల్ల దీనికి పూర్తి వ్యతిరేక ప్రభావం కలుగుతుంది. యుఎస్ వాతావరణ శాస్త్ర, పుప్పొడి కౌంట్ డాటా చేసిన సమగ్రమైన సమీక్షలో కనుగొన్న దాని ప్రకారం 10సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం ఉంటే గాలిలో పుప్పొడి స్థాయి తగ్గుతుంది. కానీ 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం ఉంటే ప్రతికూల ప్రభావం కలుగుతుంది. దానితో పాటుగా గాలిలో జనించే పుప్పొడి స్థాయి కూడా గణనీయంగా పెరుగుతుంది.
మీ ఇంటిలో మీరు దేనికి ఎలర్జీ బారిన పడవచ్చు?
ఒకవేళ మీకు కండ్లు దురదగా ఉండి , కండ్ల నుంచి నీరు కారితే, లేదా ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, తీవ్రంగా కాకపోయినప్పటికీ గురక పెడుతున్నట్లుగా శబ్దాలు వంటి లక్షణాలు మీరు ఇండోర్ లో ఉన్నప్పటికీ కనిపిస్తే, మీరు ధూళి కణాలు, పుప్పొడి, జంతువుల నుంచి రాలిన చుండ్రు, బొద్దింకల మలం, దుమ్ము తదితర ఎలర్జీ కారకాలు ఇంటిలో ఉన్నాయని భావించాల్సి ఉంటుంది.
ఎలర్జీ లక్షణాలను నివారించేందుకు అందుబాటులోని అత్యుత్తమ మార్గాలలో కొన్ని...
అత్యధిక కాలుష్యం కలిగిన రోజులలో బయట ఎక్కువ సమయం గడపడం నివారించండి
కాలుష్యం ఎక్కువగా ఉన్న రోజులలో మీ ఇంటి కిటికీలతో పాటుగా కారు అద్దాలను సైతం మూసి ఉంచండి.
బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు అలెర్జీల కారణంగా ఇబ్బంది పడకుండా ఉండటానికి తలస్నానం చేయండి. మీ ఇంటిలో వాళ్లు బయటకు వెళ్లి వచ్చినా ఆ విధానాన్ని అనుసరించాల్సిందిగా కోరండి.
బయట నుంచి ఇంటి లోపలకు వచ్చిన తరువాత వస్త్రాలు ఉతకండి.
లాన్ లో మోవింగ్ లేదా ఆకులను కత్తిరించడం వంటి పనులు చేస్తున్నప్పుడు ఫిల్టర్ మాస్క్ ధరించడానికి ప్రయత్నించండి.
ఔట్‌డోర్స్‌లో ఉన్నప్పుడు మీ కండ్లు, ముక్కును కాపాడుకోవడానికి కండ్లద్దాలు మరియు మాస్క్ ధరించండి.
క్లోజ్డ్ సిస్టమ్ వాక్యూమ్ క్లీనర్‌తో మీ ఇంటిని తరచుగా వాక్యూమ్ చేయండి
లినెన్స్ను తరచుగా ఉతకండి మరియు వెచ్చటి నీటిలో కడగలేని స్టఫ్డ్ యానిమల్స్‌ను అడ్డుకోండి.
కార్పెట్లు ను డీప్ క్లీన్ చేయడంతో పాటుగా ధూళి కణాలు, ఇతర కాలుష్య కారకాలను తగ్గించేందుకు ఫ్లోర్‌ను కడగాలి
కార్బన్ ఫిల్టర్లు మరియు హెపాతో కూడిన ఎయిర్ఫ్యూరిఫైయర్ వినియోగించి మీ ఇంటిలోని గాలిని శుభ్రపరచండి
బయట నుంచి లోపలకు మీరు మొక్కలు లాంటివి తీసుకువస్తే వాటిని ముందు కడగండి. అందువల్ల కీటకాలు మరియు ధూళి నుంచి విముక్తి పొందుతాయి.
ఎయిర్ప్యూరిఫైయర్లు ఏ విధంగా సహాయపడతాయి
గాలిని శుభ్రపరిచినా లేదంటే కార్పెట్లను శుభ్రపరిచినా, పూర్తిగా సీల్ చేయబడిన ఫిల్ట్రేషన్ కలిగిన వ్యవస్థలు అలెర్జీ కారకాలను ఒడిసి పట్టడంలో అత్యంత కీలకం. డైసన్ ఎయిర్‌ప్యూరిఫయర్లు హెపా -1 ఫిల్టర్లును సీల్డ్ ఫిల్ట్రేషన్ వ్యవస్థలతో కలిగి ఉంటాయి. అందువల్ల, మొత్తం మెషీన్ హెపా హెచ్ 1 గ్రేడ్ చేరుకుంటుంది. ఇది 99.95% అదీ అతి చిన్నగా అంటే 0.1 మైక్రాన్స్ను సైతం ఒడిసిపట్టుకుంటుందనే భరోసా కలిగి ఉంటుంది. కంటికి కనిపించే ధూళి కణాలు అయిన జుట్టు, పుప్పొడి, ఎలర్జీన్స్తో పాటుగా కంటికి కనిపించని బ్యాక్టీరియా సైతం మెషీన్ ఒడిసిపడుతుంది.
యాక్టివేటెడ్ కార్బన్ లోని రెండో లేయర్ అనిశ్చితి ఆర్గానిక్ కాంపౌండ్స్ వంటి గ్యాస్‌లు మరియు క్లీనింగ్ ఉత్పత్తులు నుంచి వెలువడే నైట్రోజన్ డై ఆక్సైడ్, బయట నుంచి వచ్చే గ్యాస్‌లను సైతం ఒడిసిపడుతుంది. అత్యంత ఖచ్చితత్త్వంతో కూడిన రబ్బర్ సీల్స్ ఈ ఫిల్టర్ల చుట్టూ ఉండటం వల్ల మెషీన్ లోపల తగిన రీతిలో సీలింగ్‌కు భరోసా కలుగుతుంది. అంతేకాదు, ఫిల్టర్ లోపలకు గాలి బైపాస్ కావడాన్ని సైతం నిరోధిస్తుంది , అలాగే పుప్పొడి, ఇతర కాలుష్యకారకాలు గదిలోకి తిరిగి ప్రవేశించకుండా అడ్డుకుంటుందనే హామీనిస్తుంది.