Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యాపార వివాదాలను అధిగమించవచ్చు
- అంతర్జాతీయ కోర్టుల్లో భారత కేసులే ఎక్కువ
- సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎల్ నాగేశ్వర రావు వెల్లడి
- ప్రభుత్వమే ముఖ్య వ్యాజ్యదారుడు : హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్
నవతెలంగాణ - బిజినెస్ బ్యూరో
వ్యాపార వివాదాలను పరిష్కరించుకోవడంలో మధ్యవరిత్వమే ఉత్తమ మార్గమని న్యాయకోవిదులు తెలిపారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ (ఫిక్కీ) శనివారం న్యాయకోవిదులతో హైదరాబాద్‌లో 'ఫైర్‌సైడ్ చాట్ సెషన్'ను నిర్వహించింది. ఈ చర్చలో తెలంగాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎల్ నాగేశ్వర రావులు పాల్గొన్నారు. దేశంలో సులభ వ్యాపారం నిర్వహణలో ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కారం (ఎడిఆర్) ఆవశ్యకతపై వారు మాట్లాడారు. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఎఎంసి) హైదరాబాద్ సహకారంతో దీనిని నిర్వహించారు. టెంపస్ లా ఫర్మ్ ఫౌండర్ సుందరి ఆర్ పీసుపాటి ఈ సదస్సుకు మోడరేటర్‌గా వ్యవహరించారు. ఈ సదస్సులో తెలంగాణా కామర్స్ అండ్ ఇండిస్టీ ప్రముఖులతో పాటుగా ఎడిఆర్ రంగంలో ప్రాక్టీస్ చేస్తోన్న న్యాయ వాదులు పాల్గొన్నారు. దేశంలో సులభ వ్యాపారం నిర్వహించుకోవ డానికి చట్టపరంగా ఉండాల్సిన సహకారం గురించి అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్బంగా నాగేశ్వర రావు మాట్లాడుతూ వ్యాపార వివిదాల పరిష్కారం అలస్యం కావడం ద్వారా చాలా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. వాణిజ్య సంస్థ, కాంట్రాక్టర్, సరఫరాదారు, ఉద్యోగుల మధ్య జరిగే వివాదాలన్నీ వీటి పరిధిలోకే వస్తాయన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా వ్యాపార వివాదాలను సులభంగా పరిష్కరించుకోవడానికి వీలుందన్నారు. అయితే కొన్ని సార్లు ఇరు పార్టీల్లో ఒక్కరు కావాలని జాప్యం చేసే సందర్బాలున్నాయన్నారు. దీని ద్వారా మరో పార్టీకి నష్టం జరగనుందన్నారు. రెండు వర్గాలు కూడా వేగంగా పరిష్కారం కోరుకు న్నప్పుడే ఫలితం ఉంటుందన్నారు. సింగపూర్‌లోని అంతర్జాతీయ మధ్య వర్తిత్వ కోర్టులో 30 శాతం కేసులు భారత్‌వేనని అన్నారు. మధ్యవర్తిత్వం ప్రోసిడింగ్స్ వంటి అంశాలతో సహా వివాదాల పరిష్కారానికి అవలం బించాల్సిన అదనపు పద్ధతులను ఉజ్జల్ భూయన్ వివరించారు. వివాద పరిష్కారానికి బదులు వివాదాలు రాకుండా దృష్టి సారించడం ద్వారా వ్యాపార సంబంధాలు సరిదిద్దుకోవడం, కొనసాగించడంపై దృష్టి సారించాలన్నారు. ఓ అవార్డు పొందడం కంటే మధ్య వర్తిత్వం చేయడం ద్వారా పరిష్కారం సాధించడం చాలా కష్టమన్నారు. చాలా వరకూ ఆర్బిట్రల్ అంశాలలో ముఖ్య వ్యాజ్యదారునిగా ప్రభుత్వమే ఉంటుందన్నారు. ఈ సమావేశంలో ఫిక్కీ ఛైర్పర్సన్ మురళి కృష్ణారెడ్డి, హైదరాబాద్ ఐఎఎంసి రిజిస్ట్రార్ తారిఖ్ ఖాన్ పాల్గొని మాట్లాడారు.