Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెన్సెక్స్ 1500 పాయింట్లు ఫట్
- రెండు సెషన్లలో భారీ నష్టం
ముంబయి : వరుసగా రెండో సెషన్లోనూ దలాల్ స్ట్రీట్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. అంతర్జాతీయ ప్రతికూల అంశాలకు తోడు దేశీయంగా ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపును కొనసాగించనుందన్న సంకేతాలు మార్కెట్లను కుదేలు చేశాయి. వరుసగా ఐదు వారాలు లాభాల్లో సాగిన సూచీలు ఆగస్టు 19న నష్టాలను ఎదుర్కోగా.. సోమవారం కూడా భారీగా పతనమయ్యాయి. ఈ రెండు సెషన్లలో బీఎస్ఈ సెన్సెక్స్ 1524 పాయింట్లు, నిఫ్టీ 465 పాయింట్ల చొప్పున నష్టపోయాయి. ఈ క్రమంలో ఇన్వెస్టర్ల సంపద రూ.6.5 లక్షల కోట్లు ఆవిరయ్యింది. సోమవారం సెషన్లో సెన్సెక్స్ ఓ దశలో 900 పాయింట్లు పైగా కోల్పోయి.. 59వేల దిగువకు పడిపోయింది. తుదకు 872 పాయింట్లు లేదా 1.46 శాతం పతనమై 58,8773.87కు దిగజారింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఇంట్రాడేలో 17,690-17,467 మధ్య కదలాడి తుదకు 268 పాయింట్లు నష్టపోయి 17,490 వద్ద ముగిసింది.బీఎస్ఈలో అన్ని రంగాల సూచీలు నేల చూపులు చూశాయి.