Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ వెల్లడి
న్యూఢిల్లీ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును పెంచిన నేపథ్యంలో అన్ని విత్త సంస్థలు వడ్డీ రేట్ల పెంపు పనిలో పడ్డాయి. తాజాగా ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ తాను ఇచ్చిన రుణాలపై వడ్డీ రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచినట్లు ప్రకటించింది. దీంతో ఆ సంస్థ ఇచ్చిన గృహ రుణాల కనీస వడ్డీ రేటు 8 శాతానికి చేరింది. ఇంతక్రితం ఇది 7.50 శాతంగా ఉంది. కాగా.. పెంచిన వడ్డీ రేేట్లు సోమవారం నుంచే అమల్లోకి వచ్చాయని తెలిపింది. '' ప్రపంచ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఆగస్టు 5న ఆర్బీఐ రెపోరేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ నేపథ్యంలో మేము వడ్డీ రేట్లు పెంచాల్సి వచ్చింది. మిగితా మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నాం'' అని ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఎండీ, సీఈఓ వై విశ్వనాథ గౌడ్ పేర్కొన్నారు.