Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్‌లో గత రెండేండవ్లలో 200% వ్యాపార వృద్ధి నమోదు
ఈ ఆర్ధిక సంవత్సరాంతానికి భారతదేశవ్యాప్తంగా 50 నగరాలలో లెన్స్‌కార్ట్ ఎట్ హోమ్ సేవలను ప్రారంభించేందుకు ప్రణాళిక చేసిన బ్రాండ్
హైదరాబాద్, ఆగస్టు 2022 : భారతదేశపు సుప్రసిద్ధ ఓమ్నీ ఛానెల్ ఐవేర్ బ్రాండ్ లెన్స్‌కార్ట్, తమ ఇంటి వద్దనే నేత్ర పరీక్షల సేవలతో ఐవేర్ భవిష్యత్‌ను సమూలంగా మార్చడంతో పాటుగా రీ ఫ్రేమ్ చేయడం కొనసాగిస్తోంది. శక్తివంతమైన కస్టమర్ సర్వీస్ మోడల్ లెన్స్‌కార్ట్ ఎట్ హోమ్ (Lenskart@Home). వినియోగదారుల అవసరాలను తీర్చాలనే లెన్స్‌కార్ట్ యొక్క డీఎన్ఏ ఆధారంగా దీనిని తీర్చిదిద్దడం జరిగింది. సౌకర్యమే ప్రధానమని భావిస్తోన్న కాలంలో వినియోగదారుల అనుభవాలను ఇది పునర్నిర్వచిం చడంతో పాటుగా ఆప్టికల్ షాప్ మరియు ఐకేర్ సేవలను సురక్షితంగా, సౌకర్యవంతంగా ఇంటికే తీసుకువ స్తుంది. లెన్స్‌కార్ట్ ఎట్ హోమ్ సేవలు ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా 23 నగరాలలో లభ్యమవుతున్నాయి. వీటిలో ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, పూనె, చెన్నై, కోయంబత్తూరు, హైదరాబాద్, వైజాగ్, కోల్‌కతా, పాట్నా మరియు ఇతర నగరాలు ఉన్నాయి. ఈ సేవలు సమగ్రమైన పరిష్కారాలను అందిస్తాయి. వీటిలో సర్టిఫైడ్ రిఫ్రాక్షనిస్ట్ చేత కంటి పరీక్షలు, ఫ్రేమ్ ట్రయల్స్, ప్రొడక్ట్ సెలెక్షన్, కస్టమైజేషన్ మరియు తుది మైలు డెలివరీ వంటివి ఉంటాయి.
హైదరాబాద్‌లో లెన్స్‌కార్ట్ ఎట్ హోమ్ వ్యాపారం 200% వృద్ధిని గత రెండు సంవత్సరాలలో చూడటంతో పాటుగా దాదాపుగా 35 మంది సర్టిఫైడ్ ఐ స్పెషలిస్ట్‌లు ఇక్కడ ఉన్నారు. ఈ స్పెషలిస్ట్‌లు కంటి పరీక్షలను అత్యాధునిక ఉపకరణాలను ఉపయోగించి చేస్తున్నారు. వీరు 3000కు పైగా ఐ గ్లాసెస్ అందించడంతో పాటుగా 4వేలకు పైగా హోమ్ విజిట్లను ప్రతి నెలా చేస్తున్నారు. లెన్స్‌కార్ట్ ఈ సేవలను ముఖ్యంగా 40-50% సంభావ్య కొనుగోలుదారుల కోసం ప్రారంభించింది. మరీ ముఖ్యంగా ఆన్లైన్లో కండ్లద్దాలను కొనుగోలు చేయాలనుకున్నప్పటికీ తమ కంటి పవర్ ఎంతో తెలియని వారి కోసం దీనిని ప్రారంభించింది. ఈ సేవల ద్వారా అత్యంత సౌకర్యవంతంగా 150-200 అత్యుత్తమంగా విక్రయించబడుతున్న ఫ్రేమ్‌ల నుంచి ఎంచుకునే అవకాశం కూడా లభిస్తుంది.
ఈ బ్రాండ్ ఇప్పుడు తమ లెన్స్‌కార్ట్ ఎట్ హోమ్ వ్యాపారం ద్వారా హైదరాబాద్, తెలంగాణా రాష్ట్రాలలో సూక్ష్మ వ్యాపారవేత్తలను సైతం సృష్టించే లక్ష్యం పెట్టుకుంది. రెవిన్యూ షేరింగ్ నమూనాలో స్ధానికులు, ఆప్టోమెట్రిస్ట్‌లు కలిసి పనిచేయడంతో పాటుగా ఆకర్షణీయమైన కమీషన్ కూడా పొందగలరు. ప్రస్తుతం లెన్స్‌కార్ట్‌కు భారతదేశంలో 23 నగరాలలో 150 ఫ్రాంచైజీలు ఉన్నాయి.
ఈ వృద్ధి గురించి లెన్స్‌కార్ట్ ఎట్ హోమ్ మరియు అసిస్టెడ్ ఆన్లైన్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ పాండే మాట్లాడుతూ 'లెన్స్‌కార్ట్ ఎట్ హోమ్ నమూనాకు అపూర్వమైన స్పందన లభించింది. మరీ ముఖ్యంగా అంతర్జాతీయంగా కొవిడ్ మహమ్మారి విజృంభణ వేళ ఇంటి వద్దనే సురక్షితంగా, సౌకర్యవంతంగా పనులు కావాలని కోరుకుంటున్నారు. ఈ ఆలోచనతోనే, ఐవేర్ సేవలను భారతదేశంలో ఆన్ డిమాండ్ క్యాబ్ సేవల ప్రదాతల మాదిరిగా అందించాలనే లక్ష్యంతో ఆన్ డిమాండ్ సేవలను ప్రారంభించాము. ఓమ్నీ ఛానెల్ వ్యూహాన్ని ముందుగానే స్వీకరించడంతో పాటుగా భారతదేశంలో లెన్స్‌కార్ట్ ఎట్ హోమ్ సేవలను ప్రారంభించడం ద్వారా ముందున్నాము. ఆప్టీషియన్ వద్ద ఎలాంటి అనుభవాలను పొందుతారో అదే తరహా అనుభవాలు, ఖచ్చితత్త్వంను మా వినియోగదారులకు అందిస్తున్నాము` అని అన్నారు.
'ఈ ఆర్థిక సంవత్సరాంతానికి భారతదేశ వ్యాప్తంగా 50 నగరాలలో లెన్స్‌కార్ట్ ఎట్ హోమ్ సేవలను లెన్స్ కార్ట్ ప్రారంభించనుంది` అని అన్నారు.
అపాయింట్మెంట్ బుక్ చేయడం కోసం లెన్స్‌కార్ట్ యాప్ లేదా వెబ్సైట్ www.lenskart.com చూడటంతో పాటుగా హోమ్ ఐ టెస్ట్ ఎంపిక చేసుకుని లెన్స్‌కార్ట్ ఎట్ హోమ్ సేవల అనుభవాలను పొందవచ్చు. అలాగే 1800–111–124కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా లెన్స్ కార్ట్ ఎట్ హోమ్ సేవలను బుక్ చేసుకోవచ్చు.